మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 3 : దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తికి మార్గదర్శిగా నిలిచారని సిద్ధిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హ యాంలో పోరాట యోధులకు సముచిత స్థానం కల్పించారని, దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ యాదవ్ కోరితే వెంటనే అధికారికంగా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశా లు ఇచ్చినట్లు గుర్తు చేశా రు. దొడ్డి కొమురయ్య జయంతి స ందర్భంగా శుక్రవా రం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితోపాటు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీసీలు, గొల్ల కురుమలకు వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని బూటకం మాటల చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 7కోట్లలోపు నిధులు ఖర్చు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయని ఆరోపించారు. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు గొర్లు ఇస్తాం, నగదు బదిలీ పథకం చేస్తామంటూ వారిని మోసం చేస్తూ మంత్రి వర్గంలో కూడా అవకాశం కల్పించలేదని విమర్శించారు.
అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో మహబూబ్‌నగర్ పచ్చబడాలని, ప్రాజెక్టులను పూర్తి చేయాలని హరీశ్‌రావు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. గతంలో పట్టణ ప్రజలకు 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యం తా గు నీరు అందించామని గుర్తు చేశారు. అలాగే రోడ్లు, పట్టణం సుందరీకరణ పనులు చేపట్టామని, అన్ని రంగాలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. పాలమూరు-రంగారెడ్డి పనులు తొంభై శాతం పూర్తి చేశామని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్‌ను కోరిన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా బీసీలకు సమాన అవకాశం కల్పించడం లేదని, 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేస్తుందని విమర్శించారు. విద్య, ఉద్యోగంలో రిజర్వేషన్లు ఇవ్వడంలేదన్నారు. అంతకుముందు దొడ్డి కొమురయ్య జ యంతి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
మద్దూరు(కొత్తపల్లి), ఏప్రిల్ 3 : ఎస్టీలను ఉన్నత హోదాలో ఉంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు.శుక్రవారం ఆయన కొత్తపల్లి మండ లంలోని తిమ్మారెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న బావోజీ జాతర ఉత్స వాలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి హాజరు కాగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు వారికి స్వాగతం పలికారు.
ముందుగా ఆలయంలోని గురులోక్ మసంద్ బావోజీ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు అనంతరం ఆయన అక్కడి నుంచి ఎక్కమేడ్ గ్రామానికి చేరుకొని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ మహిపాల్, వెంకటనర్సిములు, బుగ్గప్ప, గోపాల్, మోహన్ గౌడ్, సాయిలు, మద్దూర్ మండల నాయకులు గోపాల్, శివ కుమార్, రాజు, నరేశ్, కార్య కర్తలు, నాయ కులు పాల్గొ న్నారు.