వనపర్తి, మే 19 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పం పిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. 2018 నుంచి విడుతలుగా కొనసాగిన ఈ పథకం గొల్లకురుమల కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ పథకానికి వం దలాది గొల్లకురుమలు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల హడావుడి వల్ల పెండింగ్‌లో పడిన ఈ పథకాన్ని అవినీతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పడేసింది.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పథకాలన్నింటినీ బంద్ చేయాలన్న ఆలోచనలో ఉన్న సీఎం నిర్ణయం మేరకు పేదలకు ఉపయోగపడుతున్న సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. వనపర్తి జిల్లాలో 2018లో గొర్రెల పథకం ప్రారంభమైంది. దీని ద్వారా వందలాది యాదవ కుటుంబాలు ఉపాధిని పొందాయి. మొదటి దఫాలో 13,890 యూనిట్ల ద్వారా 2,77,800 గొర్రెలు.. 13,890 పొట్టేళ్లను పంపిణీ చేశారు. రెండో విడుతలో 11,965 యూ నిట్లను ఎంపిక చేయగా..
621 యూనిట్ల ద్వారా 12,420 గొర్రెలు, 621 పొట్టేళ్లను పంపిణీ చేశారు. జి ల్లాలోని గొర్రెలకాపరుల సహకార సంఘం ద్వారా దా దాపు 25,600మంది యాదవులు 201 గ్రామ సం ఘాల్లో సభ్యులుగా ఉన్నారు. గొర్రెల పథకంలో ఒక్కో యూనిట్ ద్వారా 20 గొర్రెలు, ఒక పొట్టేళును గత ప్రభుత్వం అందించింది. ఈ యూనిట్ ధర రూ.1.75 లక్షలు.. కాగా లబ్ధిదారుడు రైతు వాటా కింద రూ. 43,750 చెల్లిస్తే మిగిలిన రూ.1,31,250ను ప్ర భుత్వం సబ్సిడీపై అందజేసింది.
రెండో విడుతలో గొర్రెల పథకం కోసం 2,580 మంది డీడీలు కట్టారు. 2023 జూలైలో వీరంతా రూ.43వేలను లబ్ధిదారుడి వాటా కింద డీడీలు తీసి పశుసంవర్ధక శాఖకు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రా ష్ట్రంలో ప్రభుత్వం మారడం.. గొర్రెల పథకంపై స్పందించకపోవడంతో లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరగడం ప్రారంభించారు. పలు దఫాలు ప్రజావాణిలో దరఖాస్తులు అందజేయడం, కలెక్టర్ జిల్లా పర్యటనలో డీడీలు కట్టిన రైతులు మొరపెట్టుకోవడంతో సమస్య జఠిలమైంది.
డబ్బులు కట్టి నెలల తరబడి ఎదురుచూసినా గొర్రెల పంపిణీ చేయడం లే దని.. తమ డీడీలు వాపస్ ఇవ్వాలన్న వినతి మేరకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చొరవతో తిరిగి ఇచ్చేస్తున్నారు. రైతుల ద్వారా లిఖిత పూర్వక దరఖాస్తును తీసుకొని మళ్లీ వారి సొంత ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 2,507 మంది ఖా తాల్లో డీడీ డబ్బులు జమ చేశారు. డీడీలన్నీ మళ్లీ రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఇక గొర్రెల పథకం గోవింద.. అని యాదవులు భావిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ప థకాలన్నీ సందిగ్ధంలో పడ్డాయి. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు గ డిచినా పథకాల అమలుపై స్పష్టత ఇవ్వడం లే దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసి గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు చెక్ పెడుతున్నది. గొర్రెల పథకంతోపాటు కేసీఆర్ కిట్ కూడా పెండింగ్‌లోనే ఉన్నది. ఇతర పథకాలను కూడా పెంచి అమలు చేస్తామన్న ఒక్క హామీ కూడా అమలు కాలేదు. పింఛన్లు, రుణమాఫీ, మహిళలకు రూ.2,500 వంటి హా మీలు అమలుకు దూరంగా ఉండడంతో సంక్షేమ పథకాలన్నీ సందిగ్ధంలో పడినట్లయింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాకే గొర్రెల పంపిణీ పథకాన్ని ఆపేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కాంగ్రెస్ ప్ర భుత్వం కావాలనే పెం డింగ్‌లో పెడుతున్నది. దీనివల్ల పేద కుటుంబాలు ఉపాధిని కోల్పోతున్నాయి. పథకాన్ని రద్దు చేసినట్లు ప్రకటించకుండా కేవలం అవినీతి ఆరోపణలతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం సందిగ్ధంలో పడేసింది. ప్రజల్లో ఆదరణ ఉన్న పథకాలను తొలగించిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
– పెండెం కురుమూర్తి యాదవ్, గొర్రెల కాపరుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు
రెండో విడుత గొర్రెల పంపిణీలో డీడీలు కట్టిన రైతులందరి ఖాతాల్లో డ బ్బులు జమయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు డీడీలను వారి ఖాతాల్లో నే వేశాం. ఇప్పటివరకు 2,507 మందికి చె ల్లించాం.. ఇంకా 73 మందికి డబ్బులు ఇవ్వా లి. వారికి కూడా సమాచారం ఇచ్చాం. ఎప్పుడు వచ్చినా డీడీలు వారి ఖాతాలో వేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఎలాం టి ఆదేశాలు రాలేదు. రైతుల ఒత్తిడి మేరకు డీడీలు వాపస్ ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు.
– వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, వనపర్తి