మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 5 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవనంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషను మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎప్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో కలిసి మాజీ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ విక్షించారు. అనంతరం మీ డియాతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పని కాకుండానే రూ.వెయ్యి కో ట్ల మొబిలైజషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చా రు. 2007 – 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తమ్మి డిహట్టి దగ్గర దమ్మిడి పనిని ఎందుకు చేపట్టలేదన్నారు. వర్షాలు వస్తే నింపుకొనే ప్రాజక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేయలేదన్నారు. రైతులకు మేలు చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 18 రకాల అనుమతులు తీసుకున్నాం, రెండేండ్లలో మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 203 కిలో మీటర్ల సోరంగం, 1534 కిలో మీటర్ల గ్రావిటీ, 240 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుతో 20,33,572 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం కల్పించామని తెలిపారు.
కాళేశ్వరంలో 65 పిల్లర్లు ఒక దగ్గర, మరో 55 పిల్లర్లు మరో దగ్గర ఉన్నాయి. అందులో రెండు పిల్లర్లు డ్యామేజ్ అయితే దానికి కాంగ్రెస్ గగ్గోలు పెడుతుందని విమర్శించారు. రెండు పిల్లర్లను రెండు నెలల్లో పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వవచ్చు కానీ కాంగ్రెస్ దాన్ని రాజకీయం చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నారు. ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్యు అయితే కాంగ్రెస్ మాత్రం కాళేశ్వరంలో లక్ష కోట్లు అవినీతి జరిగిందని నాయకులు విమర్శిస్తున్నారు. పూర్తి అవినీతి జరిగితే ఇన్ని నిర్మాణాలు ఎక్కడ నుంచి వచ్చాయని స్వయాన సీఎం రేవంత్‌రెడ్డి మామనే ఆయన విమర్శలను తప్పుబట్టారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయలేదన్నారు. ప్రాజెక్టును కేసీఆర్ డిజైన్ చేశారనడం తప్పు ఇంజినీయర్లు, నిపుణుల సూచనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్లిందన్నారు. ఒక రైతులాగే కేసీఆర్ ఆలోచనలు చేసి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులే స్వయానా కేసీఆర్ ఉంటే బాగుండు అంటున్నారని అన్నారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. రానున్న రోజుల్లో ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూ పిస్తామన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, ఐక్యంగా పార్టీ పటిష్టకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ప్రజలందరికీ కాళేశ్వరంపై క్లారిటీ వచ్చిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. హరీశ్‌రావు చెప్పిన వాస్తవాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ 420 హమీలు అమలు చేయలేక బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తుందని, వారి చేతగాని తనాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. మేడిగడ్డ రిపేర్ చేయడానికి చేతగకాని కాంగ్రెస్ డ్రామాలన్నీ ప్రజలు అర్థమౌతున్నాయని అన్నారు. తెలంగాణ రైతులకు నీళ్లు అందించాలని ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొప్ప ప్రాజక్టులను డిజైయిన్ చేసి నిర్మాణం పూర్తి చేశామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టి 20 నెలలు పూర్తి అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. కాళేశ్వరం గొప్పతనం గురించి తెలంగాణ ప్రజలకు చెప్పడానికి కాంగ్రెస్ మరో అవకాశం కల్పించిందన్నారు. మాయ మాటలు, దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేష్ మాజీ చైర్మన్ వాల్యానాయక్, గ్రంథాలయాల మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, రహేమాన్, శివరాజ్, ఆంజనేయులు, దేవెందర్‌రెడ్డి పాల్గొన్నారు.