నాగర్‌కర్నూల్/కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి, ఫిబ్రవరి 28 : బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యా ఘటన మరవకముందే పెద్దకొత్తపల్లి మండలంలో మరో నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జుల పరమేశ్ నాయుడుపై హ త్యాయత్నం జరిగింది. ప్రభుత్వ ప థకాలపై ప్రశ్నించినందుకు మనస్సు లో పెట్టుకొని పరమేశ్‌పై రెండో సారి హత్యాయత్నానికి అధికార పార్టీ నాయకులు పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనంగా మారింది. 2023 నవంబర్ 29న తెల్లారితే పోలింగ్ ఉన్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను, ఏజెంట్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు అర్ధరాత్రి గుజ్జుల పరమేశ్ నాయుడు ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు.
తాజాగా గురువారం రాత్రి కూడా ఆయనపై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కవిత వస్తుండడంతో సాతాపూర్ బస్టాండ్ ఆవరణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. కాంగ్రెస్ నాయకులు శివరావుతోపాటు 50 మంది కలిసి పరమేశ్‌పై పథకం ప్రకారం దాడి చేశారు. అక్కడే ఉన్న గ్రామస్తులు కలుగజేసుకోవడంతో రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడ్డారు. కాంగ్రెస్ నాయకుల చేతిలో తీవ్రంగా గాయపడిన పరమేశ్‌ను బీఆర్ఎస్ నాయకులు హుటాహుటిన నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనతో గ్రామంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఎన్నికల ముందు రైతుభరోసా, రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత కొందరికి మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకొందని, కల్యాణలక్ష్మిలో తులం బంగారం, ఇందిరమ్మ ఇం డ్లు ఏమయ్యాయని గురువారం కొందరితో గ్రామంలో పరమేశ్ చర్చించినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామంలో బీఆర్ఎస్ పా ర్టీకి మళ్లీ ఆదరణ పెరుగుతోందని గ్రహించి పథకం ప్రకారం కొందరికి మద్యం తాగించి దాడికి పథకం రచించారు. ప్రభుత్వానికి చేతనైతే సంక్షే మ పథకాలను అమలు చే యాలి కానీ.. ఇలా భౌతిక దాడులకు పాల్పడితే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంతోపాటు మండలంలో రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నేతను తప్పించేందుకే హత్యాయత్నం చేశారని బీసీ సంఘాల నాయకులు ఆరోపించారు.
గతేడాది సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసేందుకు గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడుల నుంచి కూడా గుజ్జుల పరమేశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. నవంబర్ 30న పోలింగ్ ముందు రోజు రాత్రి ఏజెంట్ల ఏర్పాట్లు, పోలింగ్ మేనేజ్మెంట్పై కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఇంటిపైకి వచ్చి దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నం చేశారని, కాం గ్రెస్ నాయకులతో తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతోనే మళ్లీ దాడులు చేసేందుకు స్వేచ్ఛ దొరికినట్లు అయిందని కొందరు చర్చించుకుంటున్నారు. పరమేశ్‌పై దాడి జరుగుతున్న సమయంలో అక్కడే పోలీస్ లున్నా దాడిని ఆపలేకపోయారు. అంటే పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లోనే మెలుగుతుండంతోనే బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులు జరగడం పరిపాటిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.