గద్వాల, సెప్టెంబర్ 19 : సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సుమారు 30 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో డైరెక్టర్లు తదితరులు ఇక్కడి కాంగ్రెస్ నేతల ఆధి పత్యపోరులో ఉండలేక పార్టీని వీడి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చే రారు. ఈ నెల 6న గద్వాలలో కేటీఆర్ పర్యటన సందర్భంగా గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్, 8 మంది మాజీ కౌన్సిలర్లతోపాటు మాజీ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమ రవాయి కృష్ణారెడ్డి పార్టీలో చేరిన సంగతి విధితమే. దీని నుంచి గద్వాల కాంగ్రెస్ నేతలు కోలుకోక ముందే మరో భారీ షాక్ ఇచ్చారు.
దీంతో కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇలా ఒకరి వెనుక ఒకరు పార్టీని వీడితే తమ భవిష్యత్ ఏమిటనే అంతర్మథనంలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు పడ్డారు. గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియాలని బహిరంగా విమర్శ చేసింది కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత. ఆయన వల్లే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యేపై బహిరంగ విమర్శలు చేసింది. దీంతో సరిత, ఎమ్మెల్యే మధ్య ఉన్న వైరం మరోసారి బట్టబయలైం ది. వీరి ఇద్దరి వ్యవహారశైలి నచ్చకనే పార్టీ మారుతు న్నట్లు పార్టీ మారిన నేతలు చెబుతున్నారు.
శుక్ర వారం ఎనిమిది వాహనాల్ల్లో కేటీఆర్ సమక్షం లో గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డి, మల్ద కల్, ధరూర్ మండలాలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడానికి గద్వా ల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హన్మంతునాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వ ర్యంలో గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డి, ధరూర్, మల్దకల్ మండలాలకు చెందిన మాజీ ఎంపీ టీసీలు, సర్పంచులు, పీఏసీసీఎస్ డైరెక్టర్లు పార్టీలో చేరగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీని వాస్‌గౌడ్, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, గద్వాల బీఆర్ఎస్ నాయకులు రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రతాప్ (అల్లపాడ్),ధర్మారావు (కొత్తపాలెం), ఈరన్న (మార్లబీడు), ఆంజనేయులు (చిన్నపాడ్), ఆంజనే యులు (వామనపల్లి), హన్మంతు (నేతోనిపల్లి), గోకారి బిజ్వారం ఉపసర్పంచ్, మాజీ ఎంపీటీసీలు లక్ష్మీరెడ్డి (చిం తరేవుల), హనుమంతు (పార్చర్ల), ప్రహ్లాద్(వామనపల్లి), ఆంజనేయులు (మన్నాపురం), గోవిందు (మల్లాపురం), సింగిల్ విండో వైస్ చైర్మన్ రంగన్న అల్వాలపాడ్,రమేశ్, ఎ ల్కూర్, మంత్రానాయక్ కొత్తపాలెంతండాతో పాటు నాయకులు రవి, ఆంజనేయులు, గోవిందు, నాగరాజు, లక్షన్న తదితరులు చేరిన వారిలో ఉన్నారు.
పార్టీలో చేరిన వారితో పాటు, పాత కొత్త నాయకులు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని గద్వాల కోటపై గులాబీ జెండా ఎగుర వే యాలని కేటీఆర్ సూచించినట్లు బీఆర్ఎస్ గద్వాల నియోజ కవర్గ ఇన్ చార్జి బాస్ హన్మంతునాయుడు ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్కు భవిష్య త్ ఉందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతల తీరు వల్ల నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వా రితో పాటు పాత కొత్త వారిని కలుపుకొని గద్వా ల నియోజకరవ్గంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి కృషి చేస్తామన్నారు. కేటీఆర్ గద్వాల పర్యటనతో బీఆర్ఎస్ కు మంచి జోష్ వచ్చిందని ఆ జోష్‌తో పార్టీకి పూర్వ వైభం తీసుకువస్తామన్నారు.