కోస్గి, జూలై 1 : సీఎం ప్రాతినిద్యం వహిస్తున్న కోస్గి మండలంలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు అధికారులు కూడా వారి ఆగడాలకే వత్తాసు పలుకుతున్నారు. మండలంలోని సర్జఖాన్పేట గ్రామానికి చెం దిన బీఆర్ఎస్ కార్యకర్త కుమ్మరి చిన్నయ్యపై మంగళవారం రాత్రి 10గంటలకు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత శివకుమార్ అకారణంగా దాడి చేశాడంటూ బాధితుడు వాపోయాడు. రాత్రి తన ఇంటి పక్కన చెత్తను కాల్చగా ఎందుకు చె త్తను తగలబెట్టావంటూ బూతులు తిట్టాడని వాపోయా డు. స్థలం ఎవరిదో, చెత్త ఎవరిదో తనకేమి తెలియదని చెప్పినా వినకుండా వృద్ధుడని చూడకుండా బాధితు డి ఇం ట్లోకి వెళ్లి దాడి చేశాడని అడ్డుకోబోయిన కుటుంబసభ్యులపై కూడా దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం నేను అధికార పార్టీ నాయకుడినని , నన్నెవరు ఏమి చేయరంటూ వారికి వార్నింగ్ ఇచ్చి వెళ్లాడన్నారు.
ఈ విషయం పై బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కోస్గి మున్సిపల్ ఇన్చార్జి వెంకట్ నర్సిములు పోలీస్స్టేష న్కు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇటీవల కోస్గి మం డలంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని వీటిపై న్యా యం పోరాటం చేస్తున్నామని తెలిపారు. అధికారం ఎవరికి సొంతం కాదన్న విష యాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోరాదని మళ్లీ తాము అధికారంలోకి వచ్చాకా అన్ని తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. అనంతరం దాడి చేసిన కాంగ్రెస్ నేతపై చ ట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో గ్రామ బీ ఆర్ఎస్ నేతలు రాజు, బాలు, కోనేరు సాయప్ప, బాధిత కుటుంబ సభ్యులు ఉ న్నారు.
మీడియాపై చిందులేసిన పోలీసమ్మ
ఘటనపై వివరాలు సేకరిస్తున్న నమ స్తే తెలంగాణ విలేకరిపై అక్కడే హెడ్ కా నిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న విజయమ్మ ఇక్కడ ఫొటోలు వీడియోలు తీ య రాదంటూ చిందులు వేశారు. అనంతరం అక్కడే ఉన్న వారు ఆమెను ఇది స రి కాదంటూ వారించిన వినకుండా గత ఎస్సై బాలరాజు మాదిరి ఈ స్టేషన్ కా క పో తే మరో స్టేషనంటూ అహంకారపూరిత సమాధానం ఇచ్చారు. మీడియాపై చిందులు వేయడం సరి కాదంటూ ఇలాంటి వాటిని సమాజం క్షమించదని, పోలీ సులంటే అందరికి ఆదర్శంగా ఉండాలని బీఆర్ఎస్ కోస్గి మున్సిపల్ ఇన్చార్జ్ వెంకట్ నర్సిములు అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించటం వారి స్థాయిని మించిన పొరపాటని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.