గద్వాల, మే 28 : సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచి మాతా, శిశుమరణాలు తగ్గించాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఒక్కో కిట్‌లో 16 రకాల వస్తువులు ఉండేవి. ప్రసవం అనంతరం బా లింతలకు ఈ కిట్లను అందించడంతో ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. ఈ కిట్ల పంపిణీ తర్వాత జిల్లాలో 55 శాతానికిపైగా డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేవి. కాన్పుల అనంతరం బాలింతలకు ఈ కిట్లను అందజేసేవారు. ప్రసవించిన మహిళలకు చేయూత ని వ్వాలన్న గత ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. కిట్లు కాంగ్రెస్ పభుత్వ హయాంలో అటకెక్కాయి. బాలింతలు, గర్భిణులకు ఇచ్చే కిట్లకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇవి నిలిచిపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
గర్భిణులకు బలమైన ఆహారం అందించడంతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్‌ను కూడా అందించింది. రేవంత్ ప్రభుత్వం రావడంతో ఈ పథకం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కిట్ అందకపోవడంతో పలువురు అవస్థలు పడుతున్నారు. ప్రసవించిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో దవాఖానలో కిట్ గురించి అడిగితే వచ్చినప్పుడు ఇస్తామనే నిర్లక్ష్య సమాధానమే తప్పా వారికి అందించిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇస్తున్న కిట్ల పేరును కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందే తప్పా. అందులో పురోగతి కనిపించడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న కేసీఆర్ కిట్స్‌ను మాతా శిశు సంరక్షణ కిట్‌గా (ఎంసీహెచ్) పేరు మార్చింది. పేరు మార్చినా ప్రసవించిన మహిళలకు కిట్లు అందించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి కిట్లు, న్యూట్రిషన్ ఫుడ్ అందించడంలో లేదని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. నాటి ప్రభుత్వంలో ఈ రెండు పథకాలు పేదలకు వరంగా మారగా.. నేటి రేవంత్ సర్కారు హయాంలో ఉట్టిగానే మిగిలిపోయాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2024 జనవరి ఒకటి నుంచి ఈనెల 22 వరకు 6,913 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క బాలింతకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కిట్లు అందించలేదు. ప్రసవం తర్వాత వారి ఖర్చుల నిమిత్తం అం దించే నగదును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లే దు. సుమారు రూ.2 కోట్లపైనే చెల్లించాల్సి ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. పురుడు కోసం ప్రభు త్వ దవాఖానలకు గర్భిణులు వస్తున్నా వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు మాత్రం ఇవ్వకపోవడంతో ప్రభుత్వ తీరుపై గర్భిణులు, బాలింతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు ప్రారంభించిన ఈ పథకాలు ఆదరణ పొందగా.. నేడు పట్టించుకునే దిక్కులేకుండాపోయింది. కేసీఆర్ కిట్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు నాలుగు విడుతలుగా రూ.12 వేలు అందించేవారు. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి ఇచ్చేటోళ్లు.. మహిళ గర్భిణి అయిన నాటి నుంచి ఐదు నెలలలోపు వైద్యుల పరీక్ష అనంతరం రూ.3 వేలు, ప్రసవ సమయంలో ఆడశిశువైతే రూ.5 వేలు, మగశిశువైతే రూ.4వేలు, వ్యాధి నిరోధక టీకాల సమయంలో రూ.3 వేలు, పుట్టిన బిడ్డకు పది నెలలు నిండిన తర్వాత మిగిలిన నగదును ఇచ్చేవారు. ఈ నగదు బదిలీ గర్భిణులు, బాలింతల వ్యక్తిగత ఖాతాలో జమ చేసేవారు. ఇది కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. బాలింతలకు ప్రసవ అనంతరం కిట్లు ఇవ్వకపోగా, గర్భిణులకు అందించే న్యూట్రిషన్ కిట్లను నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు. గర్భిణుల్లో రక్తహీనతను నివారించడానికి ప్రవేశ పెట్టిన ఈ పథక లక్ష్యం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీరుగారిపోతుంది.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాలింతలకు ఇచ్చే కిట్లతోపాటు గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాలని మహిళలు కోరుతున్నారు.
గద్వాల జిల్లా దవాఖానకు రాగా సుఖ ప్రసవం జరిగింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం గర్భిణుల్లో రక్తహీనత తగ్గించి తల్లీబిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనే ఆలోచనతో న్యూట్రిషన్ కిట్ అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కిట్లు బంద్ చేశారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఎందరో రక్తహీనతతో బాధపడుతుంటారు. ఒక్కోసారి ప్రసవ సమయంలో ఇబ్బందులు తప్పవు.. అంతటి ముఖ్యమైన కిట్లు నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు. దీంతోపాటు కేసీఆర్ కిట్లకు మంగళం పాడారు. అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని, వచ్చాక అందిస్తామని చెబుతున్నారు. గతంలో దవాఖాన నుంచి ఇంటికెళ్లే సమయంలో కిట్‌తో వెళ్లేటోళ్లం..
కాన్పు జరిగినా కిట్ ఇవ్వలేదు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నాకు ప్రసవం జరిగింది. నాలుగు నెలలుగా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వలేదు. ప్రసవించిన త ర్వాత కిట్ ఇయ్యలేదు. అడిగితే పై నుంచి రాలేదు.. వచ్చి న తర్వాత ఇస్తామని చెబుతున్నారు. అవి ఎప్పుడు వస్తాయో.. ఆ దేవుడికే తెలియా లి. గత ప్రభుత్వం నేను గర్భిణిగా ఉన్న సమయంలో న్యూ ట్రిషన్ ఫుడ్ ఇవ్వడంతో పాటు వైద్య ఖర్చుల కోసం విడుతల వారీగా ఖాతాలో నగదు జమచేసే వారు. ప్రస్తుతం అది లేదు.. ఇది లేదు.
గద్వాల జిల్లా దవాఖానలో ప్రసవాలు రోజురోజు కూ పెరుగుతున్నాయి. ప్రసవ అనంతరం కిట్లు ఇవ్వాలని బాలింతల బంధువులు అడుగుతున్నారు. అయితే ప్రస్తు తం కిట్లు అందుబాటులో లేవు. సరఫరా చేయాలని ప్ర భుత్వంతోపాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల కు నివేదిక పంపాం. వచ్చిన వెంటనే అందరికీ కిట్లు అందజే స్తాం. ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.