మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 5 : డీఎస్సీ-2024 రాత పరీక్షా ఫలితాల్లో 1:3కి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ముగిందని అధికారులు శనివారం సాయంత్రం 7:40గంటలకు అధికారికంగా వెల్లడించినా.. అభ్యర్థులు మాత్రం పరేషాన్లోనే ఉన్నారు. ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 1 నుంచి 5వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఉండగా.. ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ జాబితాలు నిర్ధేశిత వెబ్సైట్లో గడువు ముగిసినా పొందుపర్చకపోవడం, స్పోర్ట్స్ కోటా కింద జీవో నం.74, 107 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా.. అధికారులు వాటిపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
2008 డీఎస్సీకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలకు మైదాన ప్రాంతాల వారిని పిలిచారంటూ ఏజెన్సీ ఏరియా గిరిజన హక్కుల పరిరక్షణ సమితి నాయకులు డీఈవో రవీందర్‌ను డైట్ కళాశాలలో కలిసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నాన్ ఏజెన్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారని, అధికారులు సైతం 1:3 నిష్పత్తిలో భాగంగా ఇప్పుడు మైదాన ప్రాంత గిరిజనుల ధ్రువపత్రాలు పరిశీలన చేశారని ఆరోపించారు. ఆయా ధ్రువపత్రాలపై నిజనిర్ధారణ చేసి ఏజెన్సీ గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ఏజెన్సీ గిరిజనులకు సంబంధించిన 18 మంది జాబితాను డీఈవోకు అందజేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 243 ఉపాధ్యాయ పోస్టులకు 1:3 నిష్పత్తిలో 729 మంది జాబితాలు ఎంపిక చేసి రాష్ట్ర అధికారులు జిల్లా స్థాయికి పం పించాల్సి ఉండగా.. ఈ జాబితాలు వాయిదాల పర్వంలా వచ్చాయి. వీటికి అనుగుణంగానే జిల్లా విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో నివేదిస్తూ అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలు పంపిస్తూ.. ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. మొ త్తం 243 పోస్టులకు 576 మందిని మాత్రమే పిలిచారు. వీరిలోనూ 24 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 2008 డీఎస్సీ అభ్యర్థులు మొత్తం 361 మందికి గాను 175 మంది మాత్రమే హాజరయ్యారు. 186 మంది గైర్హాజరు అయ్యారు. చిన్నపాటి ఉద్యోగాలకే క్యూ కడుతున్న నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగానికి పిలిచినా రాలేదా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈనెల 9న డీఎస్సీ 2024 వారికి నియామక పత్రాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారికి మా త్రమే పోస్టులు కేటాయిస్తారా, రాని వారి పరిస్థితి ఏ మిటని, పూర్తిస్థాయిలో వారికి సమాచారం అందిందా అనే ప్రశ్నలుగా మిగిలాయి. ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 20పోస్టులు జిల్లాలో ఉండగా 1:3 ప్రకారం 60 మంది అభ్యర్థులను పిలవాలి.
మరి ఈ జాబితాలు ఏమయ్యాయనే సందేహాలు ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులను వేధిస్తున్నాయి. ఈ విషయంపై డీఈవో రవీందర్‌ను సంప్రదించగా, ఉ న్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సా గుతామన్నారు. ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ కో ర్టు కేసు ఉందన్నారు. గడువు ముగిసే సమయానికి 576 మంది అభ్యర్థులకు గానూ 552 మంది హాజరు కాగా, 24 మంది గై ర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా, 2008 డీఎస్సీకి సంబంధించి 186 మం ది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు.