కోడేరు, ఏప్రిల్ 11 : మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో బతికున్న 115 మంది ఓటర్ల తొలగింపుపై గ్రామానికి చెందిన అంజన్గౌడ్, భాస్కర్ గురువారం అదనపు కలెకర్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఓటర్లను ఏ కారణం చేత ఎవరు తొలగించారో విచారణ చేసి అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుపై అతికించి లేదా దండోరా వేయించాల్సి ఉండగా ఎలాంటి కారణం చూపకుండా బతికున్న వారి పేర్లను తీసేశార ని ఆరోపించారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ కోడేరు తాసీల్దార్ కార్యాలయానికి చేరుకొని అధికారులతో విచారణ నిర్వహించారు. అయితే ఓటర్ల జాబితాలో డబుల్ పేర్లు ఉంటేనే తొలగిస్తారని, బతికున్న వారి పేర్లను ఎలా తీసేస్తారనే విషయంపై విచారణ నిర్వహిస్తున్నామని, అర్హులుంటే పేర్లను తిరిగి న మోదు చేస్తామని అదనపు కలెక్టర్ వెల్లడించారు.