గద్వాల, జూన్ 21 : విత్తన పత్తి సాగుకు నడిగడ్డ నేలలు అను కూలం కావడంతో, గత ఇరవై ఏండ్లుగా కంపెనీలు ఆర్గనైజర్లు అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడి రైతులతో సీడ్ పత్తి పంట సాగు చేయిస్తున్నారు. రైతులకు పెట్టుబడి కంపెనీలు, ఆర్గనైజర్లు ఇస్తుండడంతో నడిగడ్డ అన్నదాతలు ఎక్కువగా ఈ పంటవైపే మొగ్గు చూపుతున్నారు. మొదట్లో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ పంట సాగు సుమారు 50 వేల ఎకరాలకుపైగా చేశారంటే సీడ్ పత్తికి ఎంత డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.
ఇదే అదునుగా భావించిన కంపెనీలు, రైతులు పండించిన సీడ్ పత్తి విత్తనాలు విత్తన పరీక్ష చేస్తారు. విత్తన పరీక్ష విషయం అటు కంపెనీ, ఇటు ఆర్గనైజర్లకు మా త్రమే తెలుస్తుంది. ఈ విషయాన్ని రైతులకు పూర్తి స్థాయిలో వారు తెలియనీయడం లేదు. దీంతో ఆర్గనైజర్లు, రైతు పండించిన విత్తనాలు పాస్ అంటే పాస్.. ఫెయిల్ అంటే ఫెయిల్.. అనే పరిస్థితికి తీసుకెళ్లారు. అమాయక రైతులు వారు చెప్పిందే నిజ మనుకొని వారు ఇచ్చిన కాడికి డబ్బులు తీసుకునేటోళ్లు.
ఇలా పంట సాగు చేసిన రైతులు అప్పుల పా లు కాగా, కంపెనీలకు దళారులుగా వ్యవహరిస్తున్న ఆర్గనైజర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ విషయం తెలియని అమాయక రైతులు కంపెనీలు, ఆర్గనైజర్లు చెప్పిందే వేదంగా భావిస్తూ ఇప్పటికీ వారు మోసం చేస్తున్నా వారినే నమ్ముతున్నారు. సీడ్ పత్తి సాగు చేసిన రైతులు ప్రతి ఏటా మో సపోతున్నా వారి గోడు ఇటు ప్రభుత్వం అటు వ్యవసాయశాఖ పట్టించుకోక పోవడంతో అరణ్య రోధనగానే మారిపోయింది.
నలిగిపోతున్న కర్షకులు
జిల్లాలో ప్రస్తుతం 40వేల ఎకరాల్లో రైతులు సీడ్ పత్తి సాగు చేస్తున్నట్లు తెలుస్తుంది. సీడ్ పత్తి సాగు చేసే రైతుల వివరాలు కేవలం కంపెనీలు, ఆర్గనైజర్ల దగ్గర మాత్రమే ఉంటున్నాయి. ఈ లెక్కలు వ్యవసాయశాఖ దగ్గర లేక పోవడం కంపెనీలకు, ఆర్గనైజర్లకు కలిసి వస్తుంది. రైతులకు సీడ్ ఇవ్వాల్సిన కం పెనీలు నేరుగా రైతులకు విత్త నాలు ఇవ్వడం లే దు. వారు ఆర్గనైజర్లు అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని కంపెనీలు ఆర్గనైజర్లకు విత్తనాలు ఇస్తే ఆర్గనైజర్లు రైతులకు సరఫరా చేస్తున్నారు. సీడ్ పత్తి సాగు చేసే రైతులకు కొంత పెట్టుబడి రూపేణా కంపెనీలు, ఆర్గనైజర్లకు ఇస్తే ఆర్గనైజర్లు రైతులకు ఇస్తున్నారు.
ఇప్పటి వరకు బాగానే ఉన్నా రైతులు సాగు చేసిన పంట వివిధ కారణాల చేత చేతికి రాకున్నా, విత్తనాలు ఫెయిల్ అయినా కంపెనీలు రైతులను ప్రశ్నించరు. ఎందుకంటే కంపె నీలకు రైతులకు నేరుగా సంబంధాలు ఉండవు. విత్తనాలు ఫెయిలైతే రైతులు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కం పెనీలు ఆర్గనైజర్లపై ఒత్తిడి తేవడం, ఆర్గనైజర్లు రైతులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇద్దరి మధ్య రైతులు నలిగి పోతున్నారు. పంటనష్టం నమోదు చేయాలని వ్యవసాయశాఖ అ ధికారులను సంప్రదిస్తే రైతులు సాగు చేసిన సీడ్ పత్తి వివ రాలు వారి దగ్గర లేకపోవడంతో వారి సమస్యను ఎవరికి చె ప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
విత్తనాలు పాసైనా.. ఫెయిల్ అని చెబుతూ బురిడీ..
రైతులు సాగు చేసిన సీడ్ పత్తిని విత్తనం వేరు చేసిన తర్వాత జీవోటీ టెస్ట్ కోసం కంపెనీలు తీసు కుం టాయి. అయితే రైతులు కంపెనీలకు మంచి విత్త నాలు ఇచ్చినప్పటికీ వాటిని ఫెయిల్ అయ్యా యని చెబుతుండడంతో రైతులకు ఏమి చే యాలో తోచడం లేదు. అను మానం వచ్చిన కొంత మంది రైతులు ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయిస్తే పాస్ అని రావడంతో కంపెనీలు తమను మోసం చేస్తున్నాయని, తమకు సహకరించాల్సిన ఆర్గనైజర్లు కంపెనీలకు వత్తాసు పలుకుతు న్నారు.
దీంతో తమకు న్యాయం చేయాలని మల్దకల్, ఇటి క్యాల మండలాలకు చెందిన రైతులు నక్క రాముడు, నర్సింహులు, తిమ్మప్ప, రాజు, జయ రాములు, జయన్న తదితరులు తమ విత్తనాలు పాస్ అయినప్పటికీ కంపెనీలు, ఆర్గనైజర్లు ఫెయిల్ అయినట్లు చెబుతున్నారని, ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయిస్తే తమ విత్తనాలు పాస్ అయినట్లు రిపోర్టు వచ్చిందని వారితోపాటు మరి కొందరు రైతులు హైద రాబాద్‌లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి ఫిర్యా దు చేశారు. అందుకు స్పందించిన కమిషన్ జిల్లాలో పర్యటించి రైతులతో కూడా మాట్లాడారు. రైతుల కష్టాలు తెలుసుకొన్నారు.
కంపెనీ, ఆర్గనైజర్ల పర్యవేక్షణలో పంట సాగు చేశా..
నాకున్న రెండున్నర ఎకరాల్లో వేద -666, రాయల్ సీడ్ విత్తన పత్తిని కంపెనీ, ఆర్గనైజర్ల పర్యవేక్షణలో చివరి వరకు పంట సాగు చేశా. పంట చేతికి వచ్చిన తర్వాత జీవోటీ పరీక్ష కోసం విత్తనాలను ఆర్గనైజర్లు కంపెనీకి ఇచ్చారు. కంపెనీ వారు పరీక్ష చేసి మీ విత్తనాలు ఫెయిల్ అయ్యాయని చెబుతున్నారు. రైతులకు చెల్లించాల్సి డబ్బులను ఎగ్గొట్టడానికే కంపెనీలు, ఆర్గనైజర్లు కుమ్మక్కై ఇలా చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది. జిల్లాలో ఫెయిల్ అయిన రైతుల విత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ ల్యాబ్‌లు లేదా, ప్రేవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించి రైతులను మోసం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.
– రాజు, రైతు, నీలిపల్లి
కంపెనీలు మోసం చేస్తున్నాయి..
అమాయక రైతులను కంపెనీలు మోసం చేస్తున్నాయి. నేను వేద-999 వెరైటీని ఎకరన్నర పొలంలో సాగు చేశా. విత్తనాలు కంపెనీకి ఇచ్చా, పంట చేతికి వచ్చే వరకు కంపెనీ, ఆర్గనైజర్లు పర్యవేక్షణ చేశారు. అయితే కంపెనీ వారి ల్యాబ్‌లో జీవోటీ టెస్ట్ చేస్తే ఫెయిల్ అని రిపోర్టు ఇచ్చారు. అవే విత్తనాలను ప్రైవేట్ ల్యాబ్‌లో ఇస్తే పాస్ అయ్యాయి. ఇదేమని ప్రశ్నిస్తే కంపెనీలు ఆర్గనైజర్ల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇలా అమాయక రైతులను కంపెనీలు మోసం చేస్తూ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొడుతున్నారు. వారు పెట్టుబడి కోసం ఇచ్చిన డబ్బుల కోసం కూడా ఒత్తిడి చేస్తున్నారు.
– నర్సింహులు, రైతు, నీలిపల్లి
అమాయక రైతులే వారి టార్గెట్
నాకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో వేద, క్రిస్టల్ సీడ్ పత్తి పంట సాగు చేశా. పంట పూర్తైనా తర్వాత కంపెనీకి విత్తనాలు ఇచ్చా. కంపెనీ వారు నా విత్తనాలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. అవే విత్తనాలు ప్రైవేట్ ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే పాస్ అయ్యాయి. ఒక్కో ల్యాబ్‌లో ఒక్కో రకంగా రిజల్ట్ ఎలా వస్తుందని కంపెనీలను ప్రశ్నిస్తే ఆర్గనైజర్లను అడగండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు. దీంతో ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు రైతు కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. కమిషన్ చైర్మన్ జిల్లాలో పర్యటించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– తిమ్మప్ప, రైతు, మల్దకల్