ఊట్కూర్, ఏప్రిల్ 7 : మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయా నేలల స్వభావాన్ని బట్టి వానకాలం వేయాల్సిన పంటలకు వేసవి దుక్కులను సిద్ధం చేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు తె ల్లారిందే మొదలు ఎద్దుల నాగళ్లు, ట్రాక్టర్లతో పొలం బాట పట్టి దుక్కులు దున్నేస్తున్నారు. మహిళలు వారికి తోడుగా చెత్తాచెదారాన్ని కాల్చుతున్నారు. వానకాలం సీజన్‌కు మూడు నెలల ముందుగానే పొలం పనులను చకచకా చేసుకుంటున్నారు. జూన్ నెలలో కురిసే తొలకరి వర్షాలకే పత్తి, కం ది పంట సాగుకు పొలాల్లో పుల్ల కూడా లేకుండా చేసుకుంటున్నారు.
ఈ ఏడాది వానకాలం జిల్లాలోనే మండలం లో 60 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. రెండో స్థానంలో కంది పంట 6 వేల ఎకరాల్లో రైతులు సా గు చేశారు. రైతులు పండించిన పత్తి పంటకు రూ.7,500 నుంచి రూ.9,500 పై చిలుకు ధర లభించడంతో దిగుబడి తగ్గినా పెరిగిన పత్తి ధరలు రైతులకు ఊరటచ్చాయి. దీంతో వచ్చే వానకాలం సీజన్లో సైతం పత్తి, ఆముదం, కంది పంట పండించేందుకు రైతన్నలు ఆసక్తితో ఉ న్నారు. ఈక్రమంలోనే వానకాలం పంట సాగుకు అనుకూలంగా పంట పొలాలను దు క్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మే రకు వ్యవసాయ శాఖ అధికారులు సైతం రై తులకు వేసవి దుక్కుల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో రైతులు వేసవి దుక్కులు, వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.
రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పంట మార్పిడి, వేసవి దుక్కులు దున్నేందుకు సూచిస్తున్నాం. వేసవిలో లోతైన దుక్కులు దున్నడంతో చీడ పీడల బెడద చాలా వరకు తగ్గుతున్నది. పంట దిగుబడి కూడా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా సలహాలు, సూచనలను పాటిస్తున్నారు.
– గణేశ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ఊట్కూర్