నాగర్‌కర్నూల్, మే 31: నిబంధనలను పక్కాగా పా టిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఉదయ్‌కుమార్ సూచించారు. నెల్లికొండ మార్కెట్‌యార్డులో జూన్ 4వ తేదీ న చేపట్టనున్న నాగర్‌కర్నూల్ ఎంపీ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు రెండో విడుత శిక్షణ తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సి న పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు ఎలా చేయాలి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎ లా? అనే అంశాలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా శిక్షణ ఇచ్చారు. పలువురు కౌంటింగ్ సి బ్బంది సందేహాలను మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 6 గంటలకు సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని, నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం నాగర్‌కర్నూల్, అచ్చంపేట, గద్వా ల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 టేబుళ్ల, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుళ్ల చొప్పున ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కు ప్ర త్యేకంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపును ప్రారంభించేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోస్ట ల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కా రణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఈవీఎం ఓట్లను ఒక్కో రౌండ్ వారీ గా జాగ్రత్తగా లెక్కిస్తూ, ప్రతి రౌండ్‌కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సం బంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యథావిధిగా కొనసాగించాలన్నారు. కౌంటింగ్ సిబ్బందితోపాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన ప్రతి ఒ క్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, గందరగోళానికి తావిచ్చేలా వ్యవహరించొద్దని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లు అనుమతించబడవని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో క్రి యాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో శిక్షణ నోడల్ అధికారి గోపాల్‌నాయక్, ఎల్డీఎం కౌశల్ కిశోర్పాండే పాల్గొన్నారు.