ధన్వాడ, సెప్టెంబర్ 4 : సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది విధులను ని ర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. విధులకు సిబ్బంది ఆలస్యంగా రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9:30 గంటలైనా విధులకు హాజరుకాకపోతే ప్రజలకు ఎవరు వైద్యం అందించాల ని ప్రశ్నించారు.
దవాఖానలో పరిసరాలు అపరిశుభ్రం గా ఉండడం, ముత్రశాలులు దారుణంగా ఉండడంపై వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వ హించిన వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చే యాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో పర్యటించారు. పెద్దచెరువు నీళ్లు బయటకు వెళ్లేందుకు తీసిన గండిని పరిశీలించారు. పాతపల్లి నుంచి ధన్వాడకు వచ్చే విద్యార్థులు వాగు ఉధృతిలో కూడా నడవడాన్ని గమనించారు.
విద్యార్థులను ప్రమాదకరంగా పంపించవద్దని తల్లిదండ్రులను కోరారు. వంతెన లేకపోవడంతో ఇప్పటికే ముగ్గురు మృతిచెందారని గ్రామస్తులు కలెక్టర్‌కు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృ షి చేస్తానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో నీటి పా రుదల శాఖ అధికారులు బ్రహ్మానందం, కిరణ్‌కుమార్, శివానంద్, ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో సాయిప్రకాశ్, తాసీల్దార్ సింధూజ, డాక్టర్ కీర్తిసాయి, ఆర్ఐ మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రావు తదితరులు పా ల్గొన్నారు.
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 4 : ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చ వితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భా గంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్ర తిఏడాది మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చే యడం జరుగుతుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, రసాయనాలతో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వ ల్ల చెరువులు కలుషితమవుతాయని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి చెరువులను సంరక్షించాలన్నారు.