నాగర్‌కర్నూల్, జూన్ 20 : నిర్ణీత గడువులో గా సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వని మిల్లర్లపై చర్య లు తప్పవని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. గురువారం (2022-23) వానకాలం, యాసం గి సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) యాజమాన్యాలతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. 26వ తేదీలోగా బియ్యాన్ని అందించాలని మిల్లర్లను ఆదేశించారు. గడువులోగా ఎఫ్‌సీఐకి పంపాలని, ధాన్యం నిల్వలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
2022-23 వానకాలానికి సంబంధించి 93,268 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు గానూ 75,853 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి చెల్లించగా.. ఇంకా 17,415 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉ న్నదన్నారు. అదేవిధంగా 2023-24 వానకాలానికి సంబంధించి 49,048 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యానికి గానూ 7,192 మెట్రిక్ ట న్నులను ప్రభుత్వానికి చెల్లించగా ఇంకా.. 41, 856 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉన్నదన్నారు. నిర్ణీత గడువులోగా బియ్యాన్ని అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మిల్లర్లతో శుక్రవారం మళ్లీ స మావేశం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశం లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్వామికుమార్, బియ్యం సేల్, సప్లయ్ మేనేజర్ బాలరాజు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.