బిజినేపల్లి : ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కలెక్టర్ సంతోష్ (Collector Santosh ) , ఎమ్మెల్యే రాజారెడ్డి (MLA Raja Reddy) అన్నారు.శనివారం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం(Bijinepally) కీమ్యాతండా గ్రామంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన సన్న బియ్యంతో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన భోజన కార్యక్రమంలో వారు పాల్గొని గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు. పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా పోషకాహారాన్ని పొందాలన్నదే ఈ పథక ప్రధాన ఉద్దేశమని వివరించారు.
సన్న బియ్యం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా, పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు . ఈ కార్యక్రమంలో రాములు, వెంకటస్వామి, తిరుపతయ్య, రామచందర్, శీను, వెంకటేష్ గౌడ్, తిరుపతి, తదితరులు ఉన్నారు.