నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 19 ;దేశానికి అన్నం పెట్టే రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేసీఆర్ సర్కారు రెండుపంటలకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందించగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డి రూ.15వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా యాసంగిలో ఇవ్వకపోగా, కనీసం వానకాలమైనా ఇస్తారనుకున్న రైతన్నల ఆశలపై నీళ్లు చల్లుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుభరోసా ఇవ్వలేమంటూ చేతులెత్తేయడంపై అన్నదాతలు, గులాబీ పార్టీ నేతలు మండిపడ్డారు. నిరసనలు తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. –
కాంగ్రెస్ నేతల మాటలు సిగ్గుచేటు
వానకాలం పంట చేతికందే సమయమొచ్చినా రైతుభరోసా ఇవ్వకుం డా.. చివరికి ఇచ్చేది లేదంటూ దాటవేయడం సిగ్గుచేటని నేతలు మండిపడ్డారు. రైతులకు సీఎం రేవంత్ క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ అశోక్ ఆధ్వర్యం లో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ వరంగల్ డిక్లరేషన్ అంటూ రైతులకు రాహుల్‌గాంధీ సాక్షిగా డిసెంబర్ 9నాటికి రూ.30వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. కానీ, నేడు నిబంధనల పేరుతో సగానికి పైగా రైతులకు మొండిచేయి చూపించారన్నారు.
అలాగే రైతు భరోసా కింద రెండు పంటలకు రూ.15 వేలు అందిస్తామని వాగ్ధానం చేశారన్నారు. వానకాలం పంటలు చేతికొ చ్చే దశలో ఇక భరోసా పథకం ఇవ్వలేమని సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల చెప్పడం రైతులను నట్టేట ముం చడమేనని దుయ్యబట్టారు. కౌలు రైతులు, రైతు కూలీలకు రైతుభరోసా ఇస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ రెండు విడుతలు ఇవ్వకుండా మొత్తానికే ఎత్తేసిందన్నారు. హామీలను అమలు చేసే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పలు చెప్పి నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయ్‌కుమార్, నాగన్నయాదవ్, తిరుమల్, జాత్రునాయక్, నర్సింహ, జోహెబ్ హుస్సేన్, తిరుపతయ్య, సత్యం, మహేశ్వర్‌రెడ్డి, జమీల్, శాంతన్న, శ్రీనివాసులు, గిరి, రాము, హేమంత్, వహీద్, బాలకృష్ణ ఉన్నారు.
గ్రామాల్లోకి రానివ్వొద్దు
రై తులను నట్టేట ముంచిన కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి రానివ్వొద్దని, ఎక్కడికక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీ న ర్సింహ యాదవ్ అన్నారు. రైతుభరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్ర కటించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం మూ సాపేట జాతీయ రహదారి వేముల స్టేజీ వద్ద బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహ మాట్లాడుతూ హామీ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా ఇవ్వాల్సిందేనన్నారు. దిష్టిబొమ్మ దహనం చేయకుండా.., నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యక్రమాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట అందరినీ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేసేందుకు తీసుకొస్తుండగా.. ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో అడ్డుకొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అన్యాయం చేస్తే సహించం
వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు రైతుభరోసా రూ.15వేలు చెల్లించాల్సిందేనని మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. వానకాలం సీజన్‌కు రైతు భరోసా పోయినట్లేనని మంత్రి తుమ్మల చేసిన వాఖ్యలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగా ణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలను అక్షరాలా రేవంత్‌రెడ్డి నిజం చేస్తున్నారని అన్నారు. రైతుబంధు ఎగ్గొట్టేసి లక్షలాది మంది అన్నదాతలకు మొండి చేయి చూపించిందన్నారు. వెంటనే రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని, లేదంటే పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోనేశ్, శ్రీ రాములు, పరశురాముడు, మాజు, ముని, మౌర్య, రాజు, గంగాధర్, తిమ్మప్పగౌడ్, భాస్కర్, నర్సింహులు, కామేశ్, సోను, ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేసీఆర్ సర్కారు రెండుపంటలకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందించగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డి రూ.15వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా యాసంగిలో ఇవ్వకపోగా, కనీసం వానకాలమైనా ఇస్తారనుకున్న రైతన్నల ఆశలపై నీళ్లు చల్లుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుభరోసా ఇవ్వలేమంటూ చేతులెత్తేయడంపై అన్నదాతలు, గులాబీ పార్టీ నేతలు మండిపడ్డారు. నిరసనలు తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టులు చేశారు.