మహబూబ్‌నగర్, జూలై 7 : అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న మహబూబ్‌నగర్ ప్రభు త్వ సూపర్ స్పెషాలిటీ దవాఖా న నిర్మాణ పనులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఆ ర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న 1,003 పడకల దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించి కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ జీవన్, రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ ఇంజినీరిం గ్ అధికారి నిర్మాణ వివరాలను మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి దవాఖాన నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. 1,003 పడకలు, ఎంసీహెచ్‌లో 220 బెడ్ల తోపాటు అదనంగా వైద్యులు, ఫార్మసిస్టులు, వైద్య సిబ్బందికి తగిన వసతులతో దవాఖాన నిర్మాణాన్ని చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ని యామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక వసతులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీల్లో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. పీహెచ్సీ, సబ్ సెంటర్, ఏరి యా దవాఖానల్లో కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యం లో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అం దుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చే శారు. ఈనెల 9న సీ ఎం ఉమ్మడి జిల్లా అ భివృద్ధిపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జి ల్లా యంత్రాంగంతో చ ర్చిస్తారన్నారు. ప్రాజెక్టు లు, విద్య, వైద్యం, పర్యాటకరంగ అభివృద్ధిపై స మీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో వైద్య, వి ద్యావ్యవస్థలను మరింత బలోపేతం చే స్తామని తెలిపారు. సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేం ద్ర ప్రతాప్, మోహన్‌రావు, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ అధికారి కృష్ణ, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ జీవన్ తదితరులున్నారు.