కల్వకుర్తి, జూన్ 16 : వారం రోజులుగా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటనలు ఇచ్చారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి రైతులతో మమేకమవుతూ రైతుల కష్టసుఖాలు తెలుసుకుంటారు. అదే రోజు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లోకి మళ్లీస్తారనే వార్తలు జోరందుకున్నాయి. రాష్ట్రంలోని రైతు వేదికల వద్దకు రైతులు పెద్దఎత్తున రావాలని కాన్సరెన్స్ ద్వారా సీఎం రైతులతో మాట్లాడుతారంటూ వ్యవసాయాధికారులు సామాజిక మాధ్యమాల ద్వారా జోరుగా ప్రచారం చేశారు.
స్థానిక సంస్థలు ఎన్నికలు అతి త్వర లో నిర్వహిస్తాన్నారనే వార్తల నేపథ్యంలో రైతు భరోసాతో రైతులందరూ కాంగ్రెస్ పక్షానే అనుకున్న వారికి భంగపాటు కలిగే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. అందుకు చక్క ని ఉదాహరణ.. సోమవారం కల్వకుర్తి మున్సిపాలిటీలో రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం. రైతు నేస్తం కార్యక్రమం లో ముచ్చటగా ముగ్గురే ఉన్నారు. అందులో ఒకరు వ్యవసాయ శాఖకు చెందిన అధికారిణి. అంటే రైతు నేస్తం కార్యక్రమానికి కేవలం ఇద్ద రే రైతులు హాజరై సీఎం ప్రసంగాన్ని విన్నారు.
రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తామని ఇద్దరు ముగ్గురు మంత్రులు గత 4, 5రోజుల నుంచి వరుసగా ప్రకటనలు చేస్తున్నా.. రైతుల నుంచి పెద్దగా సంతోషం వ్యక్తం కాలేదు. ప్రభుత్వం వచ్చిన నాటి నుం చి కూడా రుణమాఫీ, రైతు భరోసాపై ప్రకటనలు మాత్రమే వస్తున్నాయి. ప్రకటనలు కా ర్యరూపం దాల్చడం లేదనే ఆసంతృప్తి రైతుల్లో ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా ఒకేసారి పూర్తిస్థాయిలో ఇచ్చారు. అది కూడా 2023 ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన రైతుబంధు డబ్బు లు అధికారం వచ్చాక రైతుల ఖాతాల్లో జమచేశారు. ఆ రైతు భరోసాను ఎన్ని ఎకరాల వర కు వేయాలనే అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి కాలయాపన చేశారు. దీంతో వానకాలం రైతు భరోసా గంగలో కలిసిపోయింది.
సాగుచేస్తున్న భూములకు రైతు భరోసా రూ.6వేల చొప్పున ఇస్తామని ప్రకటనలు చేసింది. యాసంగిలో ఎకరాకు రూ.6వేల చొప్పున రైతు భరోస్తా వేస్తామని చెప్పిన ప్రభుత్వం తేదీల మీద తేదీలు, గడువుల మీద గడువులు పెడుతూ చివరకు మూడున్నర ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు వేసిం ది. ఇందులో మరో తిరకాసు ఏమిటంటే.. పంట మార్పిడి కోసం పడావు ఉంచిన పొలాలకు రైతు భరోసా ఇవ్వలేదు. అలా కాలాయాపనతో యాసంగి గడిచిపోయింది. వానకాలం వచ్చింది. రైతులు పెట్టుబడి డబ్బుల కోసం అరిగోస పడుతూనే అష్టకష్టాలు పడుతున్నా రు.
ఈ సమయంలో ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభు త్వం నిధులు నేరుగా వస్తాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభు త్వ నిధులు రావు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అస్తవ్యస్తమవుతుంది. దీంతో స్థానిక సం స్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన ఖచ్చితమై న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో వ్యవసాయంపై ఆధారపడి మనుగడ సాగించేవారు ఉంటారు. రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
దీని నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం మళ్లీ రైతు భరోసాను ముందేసుకుంది. ఈ విషయం గ్రామాల్లో స్పష్టంగా అర్థం కావడంతో ప్రభు త్వం రైతు భరోసా గురించి ఐదారు రోజుల నుంచి పదే పదే ప్రకటనలు ఇస్తున్నా.. కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో జో రుగా ప్రచారం చేస్తున్నా రైతుల నుంచి పెద్దగా స్పందన లేదు. వచ్చిప్పుడు వస్తాయి అనే వి ధంగా రైతులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తే మన్నుపోసి అంబలి కాసుకున్నట్లేనని రైతులు అంటున్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారని జోరుగా ప్రచారం చేసినా.. రైతులు మాత్రం పెద్దగా స్పందించలేదని అర్థమవుతుంది.
ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు యా సంగివా లేదా.వానకాలానికి ఇస్తుందా అని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతు భరోసా నిధులు గురించి స్పష్టం గా చెప్పడం లేదు. యాసంగిలో మూ డున్నర ఎ కరాల వరకు రైతు భరోసా నిధులు ఇచ్చారు. మూడున్నర ఎకరాల నుంచి మిగిలిన రైతులకు రైతు భరోసా ఇస్తారా లేదా.. వానకాలం కొత్తగా ఇస్తారా అనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నారు. వానకాలం ఇస్తే యా సంగి రైతు భరోసా నష్టపోవాల్సిందేనా అని రైతులు వాపోతున్నారు.