భూత్పూర్, నవంబర్ 30 : అమిస్తాపూర్ సమీపంలో రైతు పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీ ఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు హెలీపాడ్ దిగిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం స్టాల్స్ యజమానులతో నేరుగా మాట్లాడారు.
ఎక్కడి నుండి వ చ్చారు? వ్యవసాయం ఏ విధంగా ఉం ది.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అం దుతున్నా? అడిగి తెలుకున్నారు. ప్రదర్శన కేంద్రంలో ఎలక్ట్రిక్ వాహనంపై తిరిగారు. కేవలం నిమిషాలపాటు తిరగంతో పలువురు స్టాల్స్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బహిరంగ సభా వేదికపైకి సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ చేరుకోగా సభను స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతుండగానే జనలేచి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభ జరుగుతున్న సమయంలో పోలీసులు, జనాలను భయపెట్టే ప్రయత్నం చేశారు.