వనపర్తి, డిసెంబర్ 25 : రాష్ట్రంలో సంపద పెంచి పేదలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. బ డుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్న తే ధ్యేయం గా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. శ్రీరంగాపురం మండలం తాటిపాములకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కుర్మన్న, బీఎస్పీ మం డల అధ్యక్షుడు గంధం బాలస్వామి ఆధ్వర్యంలో రెండు పార్టీలకు చెందిన 50 మంది నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే చిట్యాల శివారులోని లారీ అసోసియేషన్‌కు చెందిన 120మంది స భ్యులు గులాబీ పార్టీలో చేరారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చేరిన నా యకులకు కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరం గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవన్నారు.
దేశంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్న మొదటి రాష్ట్రం మనదే అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు నేరుగా అర్హుల చేతికి అందుతున్నాయన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. అన్నం పెట్టే రైతు యాచించే స్థితిలో కాదని, శాసించే స్థితిలో ఉండాలన్నదే ఉద్దేశమన్నారు. అందుకే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి సాగును సంబురంగా జరిగేలా చేశామన్నారు. ‘ఆబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో రాబోయేది తెలంగాణ ప్రభుత్వమని, 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం బలపడితేనే దేశం శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని, కేసీఆర్ వెంటే అందరూ ఉండాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకి టి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, మండల యూత్ కార్యదర్శి గణేశ్, నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, డిసెంబర్ 25 : క్రీస్తు బోధన ప్రకారం నడుచుకొని పరోపకారాన్ని ఆచరించాలన్నదే యేసుక్రీస్తు సందేశమని, దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టౌన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తిలో అపరిష్కృతంగా ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికకు రెండెకరాల భూమిని కేటాయించామన్నారు. జిల్లాకేంద్రంలో శాశ్వత తాగునీటి వసతికి సీఎం కేసీఆర్ సహకారంతో ప్రత్యేకంగా రూ.300 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
చెరువుల పునరుద్ధరణ, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాట్ల పనులు ప్రజలకు ఉపయోగపడేలా చేపడుతున్నామని తెలిపారు. త్వరలో వనపర్తి సమీపంలో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని పేద మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు. యేసుక్రీస్తు ఆశీస్సు లు లభించాలని మీరందరూ ప్రార్థనలు చేయాలని కోరా రు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. తప్పు చేసిన వారిని కూడా మంచి నడవడికకు, పరోపకారం కోసం ప్రార్థనలు చేయాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, డైరెక్టర్ పరంజ్యోతిని శాలువాతో చర్చి పెద్దలు సన్మానించారు. కార్యక్రమంలో చర్చి నిర్వాహకులు రంగస్వామి, రాములు, ప్రకాశ్; మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, పురుషోత్తంరెడ్డి, క్రైస్తవులు పాల్గొన్నారు.