వనపర్తి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : పాల మూరును పూలపొదరిల్లు చేశామని, నేడు గంజి, అంబలి కేంద్రాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రాజెక్టుల ద్వారా సాగునీరందించి సస్యశ్యామలం చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లే పరిస్థితి నుంచి ఉమ్మడి పాలమూరు పూర్తిగా మారిపోయిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆటంకాలు కల్పించినా అధిగమించి ఇటీవల ఒక మోటరును ప్రారంభించుకున్నామని ఆయన గుర్తు చేశారు. గురువారం వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో ప్రజాఆశీర్వాదసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడుతూ వనపర్తిని జిల్లా చేయించుకున్నాడు.. సాగునీరు తెచ్చి లక్ష ఎకరాల భూములను పసిడిపంటలు పం డేలా చేశాడు.. రోడ్ల విస్తరణను పూర్తి చేశాడు.. పట్టుబట్టి అన్నిటికంటే ఏదుల రిజర్వాయర్‌ను ముందుగా పూర్తి చేయించాడు.. ఏ పదవి లేకుండా నాతో పాటు 14ఏండ్లు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలబడ్డాడు.. నిత్యం నీళ్లు కావాలంటూ వెం టపడే వ్యక్తి కావాలా.. ఎప్పుడు కనిపించని వ్యక్తులు కావాలా అలోచించాలని, అందుకే మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఆశీర్వదించండని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు ఎలాంటి పదవులు లేకుండానే పిడికెడు మందిమైనా గట్టిగా నిలబడ్డామన్నారు.
నాడు పదవులు ఉన్న నాయకులంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై నోరుమెదపలేదన్నారు. ఒక్క వనపర్తి నియోజకవర్గానికే లక్ష ఎకరాలకు నిరంజన్‌రెడ్డి సాగునీరందించారని, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారన్నారు. ఒక్కనీటి వనరు కోసం వందసార్లు తన దగ్గరకు తిరిగాడని, వ్యవసాయంపై పూర్తిస్థాయిలో పట్టు ఉన్న ఆయన సాగునీటి సాధనలో సఫలీకృతుడయ్యాడని సీఎం చెప్పారు. పాలమూరు రంగారెడ్డిలోని ఏదుల రిజర్వాయర్‌ను సైతం అన్నింటికంటే ముందు పూర్తి చేయించారన్నారు. ఉమ్మడి పాలమూరులో ఉన్న ఇరువురు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. గతంలో మంత్రులు లేరా ఒక్క మెడికల్ కళాశాలనైనా ఏర్పాటు చేశారా ? అని సీఎం ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో నేటి మంత్రులు ఐదు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయించారని ముఖ్యమంత్రి ఉదహరించారు. ఇంకాను వనపర్తికి నిరంజన్ రెడ్డి అడుగుతున్న పశువైద్య కళాశాల, వనపర్తికి ఉత్తర భాగానా మరో బైపాస్ రోడ్డను ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జరిగిన అభివృద్ధి మీ కండ్ల ముం దర కనిపిస్తుంది.
గ్రామాల్లో అభివృద్ధిపై చర్చించండి. 60 ఏండ్లకు.. 9 ఏండ్లకు ఎంత తేడా ఉందో గుర్తించాలని ప్రజలకు సీఎం విజ్ఙప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు. గతంలో అప్పులు కట్టాలని రైతుల దర్వాజలను తొలగించుకు పోయిన కాంగ్రెస్‌ను ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దని, రైతుబంధు పథకం తెచ్చిన కేసీఆర్ పై వి శ్వాసం ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముస్లింలను, దళితులను కేవ లం ఓటు బ్యాంకు కోసమే ఇంతకాలం కాంగ్రెస్ వాడుకున్నదని చెప్పారు. వనపర్తిని అభివృద్ధిలో ముందువరసలో నిలబెట్టిన నిరంజన్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సభలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, మదుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, మాజీ ఎంపీలు మంద జగన్నాథం, రావుల చంద్రశేఖర్ రెడ్డితోపాటు గిడ్డండుగల సంస్థ చైర్పర్సన్ రజని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్కుమార్రెడ్డితోపాటు బీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మయ్య, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గతంలో సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పని చేశానని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తనకు అవకాశం కల్పించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటానని మంత్రి సింగిరెడ్డి చెప్పారు. ప్రజాఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ 2016లో జిల్లా ఏర్పాటుకు అభయమిచ్చి అమలు చేశారని, ఎంజీకేఎల్ఐ ద్వారా ఖిల్లాఘణపురం బ్రాంచి కెనాల్‌ను ప్రత్యేకంగా ఏర్పా టు చేయించారన్నారు. 2018 ఎన్నికల్లో మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలకు సీఎం హామీ ఇచ్చారని, ఆ రెండు విద్యాసంస్థలు కూడా రెండేళ్లుగా వనపర్తిలో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని వదిలిపెట్టలేదని, సీఎం సహకారంతో అన్నింటినీ పూర్తి చేసుకున్నామన్నారు. ఒక్క ఎకరాకు సాగునీరందని పరిస్థితి నుంచి నేడు రాష్ట్రంలోనే వరి,వేరుశనగ సాగులో వనపర్తి జిల్లా ప్రత్యేక స్థానంలో ఉందన్నారు. తండాలు, గ్రామాలకు రోడ్డు సౌకర్యాలను కల్పించామని, ఏదుల రిజర్వాయర్ ద్వారా వనపర్తికి సాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోయిందని, నియోజకవర్గంలో లక్షా 25వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నామన్నా రు.సాగునీటి వనరులతోపాటు విద్యానిలయాలను సమకూ ర్చి వనపర్తిని తీర్చిదిద్దామన్నారు. తొమ్మిదేండ్లుగా చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు ఉందని, మీరు మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి విజ్ఞప్తి చేశారు.