నాగర్‌కర్నూల్, జనవరి 13 (నమస్తే తెలంగా ణ) : సీఎం కేసీఆర్ పేద, రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆసరా పథకంతో పే దల జీవన ప్రమాణాల్లో పెనుమార్పు వచ్చింది. గతంలో నెలకు రూ.200 మాత్రమే పింఛన్ అం దేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ. 1000, వికలాంగులకు రూ.500 నుంచి రూ. 1500కు పెంచారు. ఇక 2018లో రెండోసారి అ ధికారంలోకి వచ్చాక ప్రజలు అడగకుండానే సీ ఎం కేసీఆర్ పింఛన్లను పెంచడం గమనార్హం. వృ ద్ధులు, వితంతువులకు రూ.1000 నుంచి రూ. 2016, వికలాంగులకు రూ.1,500 నుంచి రూ. 3,016 చొప్పున పెంచారు. ఈ పింఛన్లు 2019, ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్నాయి.
ఇక ప్రజల నుంచి వచ్చిన వినతులను గుర్తించిన సీఎం కే సీఆర్ వృద్ధాప్య పింఛన్‌ను 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించారు. గతేడాది ఆగస్టు 15 నుంచి వేలాది మందికి వృద్ధాప్య పింఛన్ పథకం వ ర్తింపజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వి తంతు పించన్ల లబ్ధిదారుల ఎంపికను సరళతరం చేయడం విశేషం. ఇంటి పెద్దగా ఉన్న వ్యక్తి చనిపోతే భార్య.. పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడం, నాయకులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
ఈ బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పింఛన్ అర్హతను సరళతరంగా చేస్తూ సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక పై భర్త చనిపోతే భార్యకు ఆసరా పింఛన్ బదిలీ కానున్నది. దీనికోసం చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ జీరాక్స్ ప్రతులను అందజేస్తే సరిపోతుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పురపాలికల్లో బిల్ కలెక్టర్లకు ఈ పత్రాలు సమర్పించాలి. ఈ వివరాలను సం బంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు నివేదించగా అక్కడి నుంచి డీఆర్డీవో, కలెక్టర్ల ఆ మోదం కోసం ఆన్లైన్లో ప్రక్రియను చేపడతా రు.
దీనికోసం ఆధార్ పోర్టల్‌లో ప్రత్యేక ఆప్షన్ ఏ ర్పాటు చేశారు. ఈ వివరాలన్నింటినీ 15 రోజు ల్లో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధిత కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. భర్త మరణ, భార్య ఆధార్లు తప్పా ఏ ఇతర డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం ఉండదని స్ప ష్టం చేయడం విశేషం. కుటుంబ పెద్దగా ఇంటిని కాపాడుకుంటున్న వ్యక్తి చనిపోతే నిరాధారంగా మారకూడదన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం. దీనిపై త్వరలో గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన క ల్పించేలా డీఆర్డీవో, మండల పరిషత్, పురపాలిక శాఖల అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఇంటి పెద్దగా ఉన్న వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకూడదని ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించింది. భర్త చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ జీరాక్స్‌లను 15 రోజుల్లో గ్రామాల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లకు అందించాలి. జిల్లాలో 1.13 లక్షల మందికి 9 రకాల పింఛన్లు అందుతుండగా 49 వేల మందికి వృద్ధ్దాప్య పింఛన్లు అందుతున్నాయి. వితంతువు పింఛన్ వర్తింపులో వచ్చిన మార్పుపై గ్రామాల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
– నర్సింగరావు, డీఆర్డీవో, నాగర్‌కర్నూల్