ఆరుసార్లు నాకు రాజకీయ జీవితం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇచ్చారు. కరెంట్ కష్టాలు తీరినయ్. ఎక్కడా జనరేటర్లు లేవు. ఇష్టపూర్వకంగా, ప్రేమతో మర్రి జనార్దన్‌రెడ్డిని బలపరుస్తున్నా. నేను, మర్రి ఇద్దరం కలిసి నాగర్‌కర్నూల్ అభివృద్ధికి కృషి చేస్తాం.

అయిజ, నవంబర్ 19 : వాల్మీకి బోయల చిరకాల ఆశలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నెరవేరుతాయి. వాల్మీకీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. అలంపూర్ నియోజకవర్గంలోని వాల్మీకులు బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
