మ్యానిఫెస్టో..సూపర్‌హిట్టో
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం ఎన్నికల మ్యానిఫె స్టో ప్రకటించారు. అందులో సంక్షేమానికి, పేదల కు అధిక ప్రాధాన్యతనిచ్చా రు.
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సీఎం కేసీఆర్
- సంక్షేమం, పేదలకు అధిక ప్రాధాన్యం
- రేషన్ కార్డు ఉన్న వారికి ‘అన్నపూర్ణ’
- కేసీఆర్ బీమా.. ప్రతి కుటుంబానికి ధీమా’తో భరోసా
- పేదలు, జర్నలిస్టులకు రూ.400కే సిలిండర్
నాగర్‌కర్నూల్/వనపర్తి , అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం ఎన్నికల మ్యానిఫె స్టో ప్రకటించారు. అందులో సంక్షేమానికి, పేదల కు అధిక ప్రాధాన్యతనిచ్చా రు. రోజువారీ జనావసరాల్లో భాగమయ్యేలా రూపొందించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్‌బ్లాంక్ అయ్యింది. ప్రజలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించే ఆసరా పింఛన్‌ను గణనీయంగా పెంచడం విశేషం. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందించేందుకు ‘అన్నపూర్ణ’ను ప్రవేశపెట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని, ఏ పార్టీ ప్రవేశపెట్టని విధంగా ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ‘కేసీఆర్ బీమా.. ప్రతి కుటుంబానికి ధీమా’తో రా ష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగనున్నది. ఈ పథ కం కింద కుటుంబంలో ప్రతిఒక్కరికీ రూ.5లక్షల బీమా సదుపాయం కల్పించింది. రైతుబంధు సాయాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రూ.12 వేలకు చేయను న్నది. వచ్చే ఐదేండ్లనాటికి రూ.16వేలకు చేరనున్నది.పేదలు, జర్నలిస్టులకు రూ.400 కే సిలిండర్ అందించాలని నిర్ణయించింది. అయి తే, ఈ మ్యానిఫెస్టో సూపర్‌హిట్టు అని విశ్లేషకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్కు ఇక తిరుగులేదని ముక్తకంఠంతో చెబుతున్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో.. ప్రతిపక్షాల మైండ్ బ్లాంకయ్యేలా చేసింది. పే దల సంక్షేమం, రోజువారీ జనావసరాల్లో భా గమయ్యేలా రూపొందించిన బీఆర్ఎస్ మ్యా నిఫెస్ట్టో సీఎం కేసీఆర్ ప్రకటించడంతోనే గ్రా మస్థాయిలోనూ ప్రజల మదిలోకి చొచ్చుకెళ్లింది. బీఆర్ఎస్ అభ్యర్థులకు తొలివిడతగా బీఫాంలను అందించడంతోపాటుగా వెల్లడించిన ఎన్నికల ప్రణాళికతో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తం కాగా ప్రజలు సైతం సానుకూలత వ్యక్తం చేస్తున్నా రు. పేదలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఈ మ్యానిఫెస్టో అద్దంపడుతుందనే అభిప్రాయాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.
పేదల మ్యానిఫెస్ట్టో..
సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజలను ఎంతగానో ఆకట్టుకొంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా రూపొందించడంపై ప్రజలతోపాటుగా మేధావుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పేదరికం దూరం చేసి పేదల ఆర్థిక జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పేదల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ మ్యానిఫెస్టోను ప్రకటించడం విశేషం. ముఖ్యంగా పేదలకు ఆర్థిక భరోసా కల్పిచే ఆసరా పింఛన్‌ను రూ.2, 016 నుంచి రూ.6,016కు పెంచ డం విశేషం. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రూ.2,016 ఆసరా పింఛన్ రూ.3,016 కు పెంచడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ఐదేండ్లల్లో రూ.5,106కు చేరుకొంటుంది. ఇక దివ్యాంగుల పింఛన్ ఇప్పటికే రూ.4,016కు చేర్చగా రాబోయే ఐదేండ్లలో రూ.6,016కు పెంచనున్నారు. గత సమైక్య పాలనలో రూ.200వరకు మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ ఈ పింఛన్లలో గణనీయంగా పెంచింది. ఇక రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందించేలా నిర్ణయించడం గమనార్హం. దీనివల్ల దొడ్డు బియ్యం సమస్య తీరుతుంది. ప్రజలందరూ సన్నబియ్యంతోనే సుష్టుగా భోజనం చేయనున్నారు.
అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం రేషన్కార్డులున్న పేదలందరికీ ఆరోగ్య ధీమా కింద రూ.5లక్షల జీవిత బీమా కల్పించనున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచేలా నిర్ణయించడం విశేషం. ఇక రైతులకు ఇస్తున్న రైతుబంధు పథకం కొనసాగిస్తూనే పెట్టుబడుల సాయాన్ని రూ.10వేల నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రూ.12వేలకు చేర్చుతారు. అనంతరం వచ్చే ఐదేండ్లనాటికి రూ.16వేలకు పెంచబడుతుంది. ఇలా ఆయా కాలాల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇలా పింఛన్లు, రైతుబంధు సాయాన్ని పెంచేలా నిర్ణయించడం ఈ మేనిఫెస్టో ప్రత్యేకత. ఇందులో కొత్తగా చేర్చబడిన పథకం మహిళలకు రూ.3వేల జీవన భృతి కల్పించే సాయం. నిరుపేద మహిళలకు నెలకు రూ.3వేల ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే పేదలకు రూ.400కే సిలిండర్ అందించనున్నారు. దీనివల్ల మహిళలకు, పేదలకు ఆర్థిక కష్టాలు తప్పుతాయి. అదేవిధంగా ఈ పథకాన్ని అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకూ వర్తింపజేయనుండటం విశేషం. కాగా అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఓ గురుకల విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మహిళా సమాఖ్య కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించడం, ఉద్యోగులకు సీపీఎస్ అధ్యయనంపై కమిటీ ఏర్పాటు చేస్తారు. పేదలు, రైతుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, జీవన ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్ట్టోపై పార్టీ శ్రేణుల్లోనూ, అన్ని వర్గాల ప్రజల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ బీఆర్ఎస్ మేనిఫెస్టో
- ఆసరా పింఛన్ ఆసరా పింఛన్ రూ.2016నుంచి రూ.5,016కు పెంపు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రూ.3016కు పెంచి రాబోయే ఐదేండ్లలో రూ.5,016కు పెంచడం జరుగుతుంది. వికలాంగుల పింఛన్ రూ.4,016నుంచి రూ.6,016కు పెంపుదల. ఇప్పటికే ఈ పింఛన్‌ను రూ.3,016కు పెంచడం జరిగింది.
- ఆరోగ్య ధీమారాష్ట్రంలోని 93లక్షల కటుంబాలకు కేసీఆర్ భీమా పథకంతో ఆరోగ్య ధీమా కల్పించడం జరుగుతుంది. ప్రతి ఇంటికీ ధీమా పథకం కింద రూ.5లక్షల బీమా
- అన్నపూర్ణ పథకంరాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది.
- రైతుబంధు రూ.16,000రైతుబంధు పథకం ఎకరానికి రూ.10వేల నుంచి రూ.16వేల వరకు పెంచడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనే రూ.12వేలకు పెంచడం జరుగుతుంది. ఆ తర్వాత రాబోయే ఐదేండ్లలో రూ.16వేలకు పెంచబడుతుంది.
- అర్హులైన మహిళలక రూ.3వేల చొప్పున ప్రతినెలా అందించడం జరుగుతుంది. తద్వారా పేద మహిళల ఆర్థిక భరోసాకు ప్రభుత్వం కట్టుబడుతుంది.
- రూ.400కే సిలిండర్ పేదలకు రూ.400కే సిలిండర్ అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా అక్రిడిటేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకూ ఈ పథకం వర్తింపజేయనుండటం విశేషం.
- ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి రూ.15లక్షలకు పెంపు. ఇప్పటి వరకు రూ.5లక్షలు ఉండగా పేదల కోసం సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పెంపు చేపట్టారు.
- అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాల ఏర్పాటు
- మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు
- ఇంటి స్థలాలు లేని పేదలకు ఇండ్ల స్థలాలు
- ఉద్యోగుల సీపీఎస్‌పై అధ్యయన కమిటీ ఏర్పాటు
- అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ
పేదల పక్షపాత మ్యానిఫెస్టో
సీఎం కేసీఆర్ రూపొందించిన మ్యానిఫెస్ట్టో పేద లపై ప్రేమను నిరూపిస్తుంది. ఆసరా పింఛన్ల పెంపుదల, పేదల ఆరో గ్యం కోసం బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి, రైతుబం ధు పెంపు, పేద మహిళలకు జీవన భృతి, మహి ళా సమాఖ్యలకు భవనాల నిర్మాణం, రూ. 400కు సిలిండర్లు వంటి పథకాలన్నీ ఎంతో మేలు కల్పిస్తాయి. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్ట్టో ప్రజలకు నమ్మకాన్ని కల్పిస్తుంది.
– మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

