మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 28 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ ఉత్సాహంగా జరుగుతున్నది. టోర్నీలో 33 జిల్లాల నుంచి బాలబాలికలు పాల్గొనగా.. శనివారం ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. రోజంతా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి.
బాలుర విభాగంలో.. మహబూబ్‌నగర్ జట్టు 35-22 పాయింట్స్ తేడాతో మెదక్ పై, వనపర్తి 37-10 తేడాతో యాదాద్రి భువనగిరిపై, మేడ్చల్ 33-12 తేడాతో భూపాలపల్లిపై, కొత్తగూడెం 34-25 తేడాతో హన్మకొండపై, నారాయణపేట 33-10 తేడాతో సిరిసిల్లపై, ఆసిఫాబాద్ 32-30 తేడాతో నిర్మల్‌పై, సిద్దిపేట 36-11 తేడాతో జగిత్యాలపై.. హైదరాబాద్ 26-10 తేడాతో సంగారెడ్డిపై, మంచిర్యాల 27-20 తేడాతో వరంగల్‌పై.. యాదాద్రి భువనగిరి 38-25 పాయింట్లలో మెదక్‌పై, ములుగు 31- 20 తేడాతో మహబూబ్‌నగర్‌పై, రంగారెడ్డి 37-19 తేడాతో భూపాలపల్లిపై, గద్వాల 25-16 తేడాతో ఆసిఫాబాద్‌పై, నాగర్‌కర్నూల్ 18-13 తేడాతో సిద్దిపేటపై విజాయం సాధించాయి.
అలాగే బాలికల విభాగంలో.. నారాయణపేట జట్టు 33-19 పాయింట్లతో ఆసిఫాబాద్‌పై, గద్వాల 52-23 తేడాతో వరంగల్‌పై, నాగర్‌కర్నూల్ 27-03 తేడాతో పెద్దపల్లిపై, వికారాబాద్ 54-39 తేడాతో పెద్దపల్లిపై, నాగర్‌కర్నూల్ 40-07 తేడాతో సంగారెడ్డిపై, వనపర్తి 35-18 తేడాతో మంచిర్యాలపై, రంగారెడ్డి 34-13 తేడాతో నిర్మల్‌పై, హైదరాబాద్ 55-18 తేడాతో ఆసిఫాబాద్‌పై, జగిత్యాల 41-40 తే డాతో ఖమ్మంపై, కొత్తగూడెం 50-31 తేడాతో మహబూబ్‌నగర్ జ ట్టుపై గెలుపొందాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీవైఎస్వో శ్రీనివాస్, వినోద్, క్రీడా సంఘాల నాయకులు విలియం, జగన్మోహన్గౌడ్, బాల్‌రాజ్, వేణుగోపాల్, వడెన్న, గజానంద్, నిరంజన్, చెన్నవీరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.