జడ్చర్లటౌన్, మే 2 : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న నియోజకవర్గస్థాయి సీఎల్ఆర్ చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను జడ్చర్లలోని ప్యూచర్సిటి మైదానంలో శనివారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించి, కొద్దిసేపు బ్యా టింగ్ చేసి ఆకట్టుకున్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములు సహజమని, ఎవరూ గెలిచినా, ఓడినా క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చా టాలని సూచించారు. సీఎల్ఆర్ టోర్నమెంట్లో పాల్గొంటున్న జట్లకు మాజీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి మొత్తం 74జట్లు పాల్గొంటున్నాయని, వారం రోజుల పాటు టోర్నమెంట్ కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపా రు.
టోర్నమెంట్లో మొదటి విజేత జ ట్టుకు రూ. లక్ష, రెండో విజేత జట్టుకు రూ.50వేలు నగదుతో పాటు ట్రోఫీని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీమాజీ వైస్ చై ర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు రఘుపతిరెడ్డి, పిట్టల మురళి, ప్రణీల్‌చందర్, ఇంతియాజ్, శశికిరణ్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, ప్రశాంత్‌రెడ్డి, నందకిశోర్‌గౌడ్, ఉమాశంకర్‌గౌడ్, వీరేశ్, శంకర్‌నాయక్, ఆల్మాస్, కరాటే శ్రీను, అలీం, ప్రభాకర్‌గౌడ్, కొండల్, సాగర్, నవీన్‌చంద్రారెడ్డి తోపాటు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.