మాగనూర్/కృష్ణ, జూలై 16 : త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, పల్లె పోరుతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గుడెబల్లూరు గ్రామ శివారులో మాగనూరు, కృష్ణ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగనూరు, కృష్ణ మండలాల కార్యకర్తలు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందినప్పటి నుండి 18 నెలల పాటు తీవ్రమైన అవమానా లు ఎదురొనడంతోపాటు ఏ ఒక్క కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు అధికారులు పనులు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలలో సైతం తమ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇస్తూ, నిరుపేదలైనటువంటి ప్రజలకు ఏ ఒక సంక్షేమ పథకాన్ని అందించకుండా కాంగ్రెస్ నాయకులు అరాచకమైన పాలనను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి ఏం చేస్తున్నారో తనకే అర్థం కాకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా నదికి వరద వచ్చి నెలన్నర గడిచినప్పటికీ నియోజకవర్గంలోని భూ త్పూర్, సంగంబండ రిజర్వాయర్లను వరద నీటితో నింపకుండగా నిర్లక్ష్యం వహించారన్నా రు.
దీంతో రెండు రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగానికి సాగుకు నీరు అందుతుందా అనే సంశయంలో నేడు రైతన్న లు ఉన్నారని పేరొన్నారు. నదికి వరద వచ్చినప్పుడు మాత్రమే ఎత్తిపోసుకొని ప్రాజెక్టులను నింపుడంటే, ప్రాజెక్టు పరిధిలోని చెరువులకు నీటి విడుదల చేస్తే ఆయకట్టు రైతాంగానికి సాగునీరు పుషలంగా అందుతుందని పేరొన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఇసుక, ఒండ్రుమట్టి, కల్లు మాఫియాపై పెట్టిన శ్రద్ధ రైతాంగానికి నీరు అందించడంపై మంత్రివర్యులు పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన దొంగ హామీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అవే మన పార్టీ విజయానికి సహకరిస్తాయని సూచించారు.
మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు కృష్ణ మండలాల కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండి ఎంతటి ఒత్తిడినైనా ఎదురొని, స్థానిక సంస్థ ల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ వార్డు మెంబర్లను కైవసం చేసుకొనేందుకు కార్యకర్తలు స మిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో రైతు సమన్వయ సభ్యురాలు సు చరితారెడ్డి, రాజుల ఆశిరెడ్డి, మక్తల్ మాజీ మా రెట్ చైర్మన్ నరసింహారెడ్డి, రాజేశ్ గౌడ్, బీఆర్ఎస్ మాగనూరు ఉమ్మడి మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి పీఏసీసీఎస్ చై ర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు శివరాజ్ పా టిల్, శివప్ప, మహదేవ్, అశోక్‌గౌడ్, శంకర్‌నాయక్, మోనే శ్, అబ్దుల్‌ఖాదర్, భీమ్, రవి, క్షిరలింగప్ప, తి ప్పయ్య, మారెప్ప, పల్లె ప్ప, అశోక్గౌ డ్, రాఘవేంద్ర, రాఘవేంద్రగౌడ్, అమ్రేష్తోపాటు వివిధ గ్రామాల కొరత పాల్గొన్నారు.