మక్తల్, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ పార్టీలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటూ కృష్ణ మండలంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసి మాజీ వైస్ ఎంపీపీ డాక్టర్ ఈశ్వర్ గౌడ మాలిక్ పటేల్ మరణం పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణ మండలం మాజీ వైస్ ఎంపీపీ డాక్టర్ ఈశ్వర్ గౌడ మాలిక్ పటేల్ అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న రామ్మోహన్ రెడ్డి బుధవారం కర్ణాటక రాష్ట్రంలోని గదక్ జిల్లా రానా పట్టణంలో వారి నివాస గృహంలో డాక్టర్ ఈశ్వర్ గౌడ మాలిక్ పటేల్ పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్న నాయకుని కోల్పోవడం ఎంతో బాధను కలిగించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట భారత రాష్ట్ర సమితి నాయకులు శివరాజ్, తదితరులు ఉన్నారు.