మాగనూరు (కృష్ణ), సెప్టెంబర్ 24 : రైతుల నుంచి కొన్న వడ్లకు క్విం టాకు రూ.500 ఇస్తామన్న బోనస్ ఏమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నదని ఆరోపించారు. బుధవారం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ మండల పరిధిలోని టైరోడ్డు 167 జాతీయ రహదారి కూడలిలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి ముందుగా మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పంట పొలాల్లో పనులు వదిలేసి యూరియా కోసం రోడ్లెకి మరి ధర్నాలు చేస్తున్నారంటే దీని ఘనత ఒక్క రేవంత్ రెడ్డికే దకుతుందన్నారు. ఉదయంలో ఏ సోష ల్ మీడియాలో చూసినా ఈ టీవీలో చూసినా యూరియా కోసం రైతుల మీద లాఠీచార్జీలు, పోలీస్ స్టేషన్లో టోకెన్ల పంపిణీలు, రైతులకు 10 బస్తాల యురియా కావాల్సి వస్తే రెండు బస్తాలు ఇవ్వడం, అరకొర యూరియా సరఫరాతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవిని కా పాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోయిందని, ఇక ప్రజలను ఏం పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు.
గ్రామపంచాయతీల నిర్వహణలో ఐతే ఒక ట్రాక్టర్లో డీజిల్ పోయలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందని, పారిశు ధ్య నిర్వహణ అయితే చెప్పడానికి వీలులేకుం డా పోవడంతో గ్రామాలన్నీ మురికి కూపాలుగా, చెత్తాచెదారంతో నిండిపోయి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కా లంలో పేపర్ల చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని తిడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. పాలమూరు ఎమ్మెల్యే యెన్నం ఒక స్టేట్మెంట్ విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైనా గ్రామాల్లో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్నారు. మరో పక్క నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంటాడు.. రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే మా ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని చెబుతున్నారంటే ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ముఖ్యంగా ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని, రైతు భరోసాను సక్రమంగా అందించకుండా, రుణమాఫీని కూడా అందరికీ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందుల పాలు చేసిందని, ప్రస్తుతం యూరియాను కూడా సరిగా పంపిణీ చేయకపోవడంతో రైతులు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితిని తీసుకువచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు రైతు భరోసాను ఎగ్గొట్టిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రైతు బీమాను అయితే పూర్తిగా గాలికొదిలేయడమే కాకుండా దీనిపై ప్రభుత్వం వ్యంగస్ర్తాలు సంధిస్తున్నదని, రైతులను అవమానిస్తున్నదని ఆరోపించారు. ఈ ప్రభుత్తానికి రియల్ ఎస్టేట్ దందాలపై ఉన్న శ్రద్ధ ప్రజా పాలనపై లేదని, ఈ కారణంగానే రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు అందరూ వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలు హామీ ఇచ్చి వాటిని అమలు చేయడానికి చేతగాక గత ప్రభుత్వంపై దుమ్మొతిపోయడమే పనిగా పెట్టుకుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్ అంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదు.
ఆయన ఊసెత్తకుండా ఒక్క సభలోనూ.. సమావేశంలోనూ మాట్లాడిన దాఖలాలు లేవని, తమ చేతగాని తనాన్ని ఇతరులపై రద్దుతూ పథకాలను అమలును అటకెక్కించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని హై కోర్టు చెబితే దాని ఊసే ఎత్తకుండా బీసీ రిజర్వేషన్లు పేరు చెప్పి వాటిని వా యిదా వేసేందుకు యత్నిస్తుందని దుయ్యబట్టారు. మక్తల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మ ంత్రి వాటికి శ్రీహరి నియోజకవర్గంలో మూ డు వేల ఇండ్లు ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నాడని, గతంలో తాను నియోజవర్గంలో 48 వేల ఇండ్లు ఇచ్చి కూడా అంతలా చెప్పుకోలేదని, మీరు ఇచ్చింది కూడా కేవలం మీ కార్యకర్తలకే కానీ అదేదో ప్రజలకు ఇచ్చినట్లు పొంగి పోవడం ఎందుకని ప్రశ్నించారు.
మీ ప్రభుత్వంలో ఇండ్లు కట్టకుండానే బిల్లు లు ఎత్తుకున్న రోజులు ఉ న్నాయని, ఎలక్షన్ సమయం లో మీ పార్టీ నాయకులు ఎవ రు ఎన్ని బిల్లులు ఎతుకొని తి న్నారో ఆధారాలతో బయటపెడతామని అన్నారు. మా ప్రభుత్వంలో వానకాలం, యాసంగి పంటలకు రైతులకు రైతు బంధు ఇస్తే.. మీరు రెండేండ్ల కాలం లో రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని, రుణమాఫీ విషయంలోనూ అందరికీ మాఫీ చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు చూస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అవేవీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు పడావు పడుతుందని, మళ్లీ వలసలు, ఆకలి చావులకు ప్రజలు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకించాలని, అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకొని పోరాటానికి సిద్ధం కావాలిని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మాగనూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కృష్ణ మండల బీఆర్ఎస్ నా యకులు శివరాజ్ పాటిల్, మోనేశ్, శివప్ప, అశోక్‌గౌడ్, చిన్నఅశోక్గౌడ్, మాజీ సర్పంచులు అంబరీష్, రామకృష్ణ, శంకరప్ప, సు రేశ్, అశోక్, రాఘవరెడ్డి, ఎల్లప్ప, అంజప్ప, మారెప్పతోపాటు మాగనూర్, కృష్ణ మండలలోని బీఆర్ఎస్ పార్టీశ్రేణులు పాల్గొన్నారు.