 
                                                            మక్తల్, అక్టోబర్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి సోపానాలుగా మారుతున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత విజయానికి మద్దతుగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ను గెలిపించాలని గెలిపించాలని కోరారు.
నారాయణపేట, అక్టోబర్ 30 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ను గెలిపించాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఓటర్లను కోరా రు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని 102 బూత్‌లోని వినాయక నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ మాగంటి సునీత గోపినాథ్‌కు అధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.
 
                            