అమరచింత, ఆగస్టు 23 : రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఆగమవుతున్నారని, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు అసమర్థులని మక్తల్ మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. శనివారం ఆత్మకూరు ప్రభు త్వ అతిథి గృహంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంచామని గుర్తు చేశారు. ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత లేకుండా రైతులకు అందజేసినట్లు తెలిపారు.
ముందస్తుగా పలు శాఖల అధికారులతో వారం.. వారం సమీక్షలు నిర్వహించి నిల్వలను తెప్పించారన్నారు. ఏదో మార్పు చేస్తానని.. 420 హామీలను ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆదాయానంతా అమాంతం ఢిల్లీ పెద్దలకు మూటగట్టి పంపిస్తూ ఇక్కడి ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయితే ఇక్కడి సమస్యలు తీరుతాయని, ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తే.. ఆశలపై నీళ్లు చల్లారన్నా రు. జిల్లా మంత్రి జూపల్లి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను గాలికొదిలారని ఆరోపించారు.
జూరాల, భీమా ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు సాగునీరు తరలించేందుకు సీఎం యత్నిస్తుంటే.. స్థానిక మంత్రి శ్రీహరి నోట కనీసం మాట కూడా రావడం లేదన్నారు. రెండు వారాలుగా ఆత్మకూరు, అమరచింత మండలాల రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ఏ ఒక్కరోజు కూడా ఈ సమస్యపై మంత్రులు మాట్లాడడం లేదన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. మరో రెండ్రోజుల్లో రైతులకు అవసరమైన యూ రియా అందించకపోతే ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ రైతులతో కలిసి నిలదీస్తామన్నారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ కోటేశ్, కో ఆప్షన్ సభ్యులు షరీఫ్, మాజీ సర్పంచ్ అంజి, బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్, రమేశ్, రాజేందర్‌సింగ్, రియాజ్అలీ, శేఖర్ పాల్గొన్నారు.