Cockroach Janta Party: ఢిల్లీకి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. జూన్ 6న నిరసన ప్రదర్శన
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జూన్ 6వ తేదీన ఇండియా రానున్నాడు. పరీక్ష ఫలితాల అంశంలో నైతిక బాధ్యత తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిర్వహించే శాంతియుత ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడతను.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జూన్ 6వ తేదీన ఇండియా రానున్నాడు. ఎంట్రెన్స్ పరీక్షల ఫలితాల అంశంలో నైతిక బాధ్యత తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిర్వహించే శాంతియుత ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీప్కే ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఢిల్లీలో జరిగే ఆ నిరసన కార్యక్రమంలో మద్దతుదారులు, విద్యార్థులు పాల్గొవాలని పిలుపు ఇచ్చారు. అందరం దగ్గరకు రావాల్సిన సమయం ఆసన్నమైందని, భారత రాజ్యాంగం అడుగుజాడల్లో.. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ కోరుదామన్నాడు. మనం మన గళం విప్పితే, దానికి వాళ్లు తప్పకుండా వింటారన్నారు.
జూన్ 6వ తేదీన తన మద్దతుదారులందరూ విమానాశ్రయానికి చేరుకోవాలని తన వీడియో మెసేజ్‌లో పిలుపునిచ్చారు. జూన్ 6, శనివారం ఉదయం నేను ఢిల్లీకి చేరుకుంటానని, అందరూ విమానాశ్రయానికి రావాలని, కలిసికట్టుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్దామని దీప్కే అన్నాడు. జంతర్ మంతర్‌లో శాంతియుత ప్రదర్శన కోసం పర్మిషన్ అడుగుదామన్నాడు. నీటి, సీబీఎస్ఈ లాంటి పరీక్షల సంబంధిత వివాదాల వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం దీనిపై బాధ్యత తీసుకోవాలని దీప్కే అన్నారు. సోషల్ మీడియా ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ పార్టీని సబ్‌స్క్రైబ్ చేస్తున్న వారి సంఖ్య కూడా కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

