Traffic Fine | భారతీయ టూరిస్ట్‌కు షాకిచ్చిన స్విట్జర్లాండ్.. ట్రిప్ పూర్తైన ఏడాదికి ట్రాఫిక్ చలాన్.. లక్షన్నర కట్టాలంటూ నోటీస్
Traffic Fine : స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి, వచ్చిన ఒక భారతీయ టూరిస్ట్‌కు ఆ దేశం షాకిచ్చింది. ట్రిప్ పూర్తైన ఏడాది తర్వాత ట్రాఫిక్ చలాన్ విధిస్తూ నోటీస్ పంపింది. దీనికి సంబంధించిన వివరాల్ని ఆ టూరిస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
Traffic Fine : స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి, వచ్చిన ఒక భారతీయ టూరిస్ట్‌కు ఆ దేశం షాకిచ్చింది. ట్రిప్ పూర్తైన ఏడాది తర్వాత ట్రాఫిక్ చలాన్ విధిస్తూ నోటీస్ పంపింది. దీనికి సంబంధించిన వివరాల్ని ఆ టూరిస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. పోన్ సాప్డి అనే ఒక యూజర్ తన ఎక్స్ ఖాతాలో ఈ వివరాల్ని పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ ప్రకారం. పోన్ సాప్డి అనే మహిళ ఏడాదిక్రితం వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చింది.
అక్కడ ఆ సమయంలో ఒక చోట స్టే చేసి, వాహనాలు అద్దెకు తీసుకుంటారు. ఈ సమయంలో అగ్రిమెంట్ కింద పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా, ఆమె అన్ని వివరాలు అక్కడ సమర్పించింది. ఇదే సమయంలో వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడింది. తర్వాత కొద్ది రోజులకు ఇండియా తిరిగి వచ్చింది. ఇది జరిగి ఏడాది పూర్తైంది. అయితే, ఇంతకాలానికి ఆమె మెయిల్‌కు స్విట్జర్లాండ్ నుంచి మెయిల్ వచ్చింది. అక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను రూ.1.5 లక్షల వరకు పన్ను చెల్లించాలని మెయిల్లో పేర్కొన్నారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోన్ సాప్డి నెటిజన్లను ఈ విషయంలో సలహా అడిగింది.
Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?
We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.
— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026
చలాన్ రద్దు చేసుకునేందుకు, మినహాయింపు కోరేందుకు, లేదా తగ్గించేందుకు ఏమైనా చేయొచ్చా అని నెటిజన్లను అడిగింది. స్విట్జర్లాండ్‌కు సంబంధించిన చట్టాలపై అవగాహన ఉంటే చెప్పాలని కోరింది. దీంతో ఆమెకు చాలా మంది సలహాలు ఇస్తున్నారు. ఆలస్యం చేయకుండా ట్రాఫిక్ ఫైన్ చెల్లించాలని సూచిస్తున్నారు. లేకుంటే దీనిపై వడ్డీ కూడా విధించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పైగా డిస్కౌంట్ లాంటివి అడిగితే, ఆ ఫైన్ ఇంకా పెంచుతారే తప్ప తగ్గించరు అని చెబతున్నారు. దీంతో తాను ఈ చలాన్ ఎలాగైనా చెల్లిస్తానని ఆమె చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

