మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టింది. ప్రత్యేకమైన నడిగడ్డ భూముల్లో మిరప సాగు చేయగా.. ఆకుముడతతోపాటు ఇతర తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన ఏడాది మిరప వేసిన రైతులు లాభాలు పొందగా.. ఈసారి కోటి ఆశలతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో పంట సాగు చేశారు. తెగుళ్ల బెడద.. కాలం కలిసిరాకపోవడం కర్షకన్న కంటిమీద కునుకులేకుండా చేసింది. దీంతో దిగుబడి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 75,842 ఎకరాల్లో పంట సాగైంది.
– గద్వాల, డిసెంబర్ 1
గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు పంటకు ఆకు ముడత తెగులు సోకడంతో నష్టపోయా రు. ఈ ఏడాదైనా లాభాలు రావా అనే గంపెడాశతో రైతులు ఈ వానకాలం గద్వాల, అ లంపూర్ నియోజకవర్గాల్లో జిల్లాలో పెద్ద ఎ త్తున మిరప పంట సాగు చేశారు. అయితే ప్రస్తుతం మిర్చి సాగు చేసిన రైతుల కంట్లో కన్నీటి చుక్కలు కారుతున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో ఏమి చేయాలో తోచడం లేదు. వేసిన పంటకు తెగుళ్ల పీ డ ఉండడంతో రైతుకు ఈ పరిణామం కంటి మీద కునుకు లేకుండా చేసిం ది. పంటను నమ్ముకుని లాభాలు వ స్తాయని అనుకున్న మిర్చి రైతులకు అప్పులు మిగిలేలా కనిపిస్తుంది.
నడిగడ్డ భూములు మిర్చి సాగుకు అనుకూలం కావడంతో రైతులు 2024లో ఈ పంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. సా గు చేసిన రైతులకు పెట్టుబడిపోను ఏటా ఎకరాకూ రూ.50 వేలపైనే ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రై తు పండించిన మిర్చిని అమ్మిన పెట్టిన పెట్టుబడికి సరిపోయే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేసిన మిర్చి పంటకు ఆకు ముడత పురుగు, కొమ్మకు ళ్లు, జెమిని వైరస్, పచ్చ, తెల్లదోమ సోకడంతో పై రు ఎదకపోవడంతోపాటు దిగుబడి రాక పోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిర్చి పంటలకు ఆకుముడత పురుగుతోపా టు ఇతర వైరస్లు సోకడంతో దిగుబడులు పూ ర్తిగా తగ్గిపోయా యి. గతంలో ఎకరాకు సుమారు 20 క్వింటాళ్ల వరకు మిరపను రైతులు పండించే వారు. ప్రస్తుతం చీడపీడలు సోకడంతో దిగుబ డి కాస్తా 8 నుంచి 10 క్వింటాళ్లకు పడిపోయింది. 2022లో రైతులు ఎకరాకూ 20 క్వింటాళ్ల పంట పండించగా.. ధర కూడ ఎక్కువగా వ చ్చింది. దీంతో మంచి లాభా లు రైతులు ఆర్జించారు. 2022-2023 సంవత్సరంలో గుంటూరు మిర్చి క్వింటా రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు బాడీ రకం రూ.15 వేల నుంచి రూ.35 వేల ధర పలికింది. ప్రస్తు తం దిగుబడి లేక పోవడం దాని ధర కూడా రూ. 15 వేల నుంచి రూ.18వేలలోపు ఉండడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. దీంతో ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మూడెకరాలు కౌలు కు తీసుకొని మిరప సా గు చేశాను. పంటకు తెగు లు సోకడంతో దిగుబడి పె రగడం లేదు. గతంలో ధర లు బాగా ఉండగా.. ఈ ఏ డాది దిగుబడి తక్కువే.. ధర లు లేవు. కూలీ ఒకరికి రోజుకు రూ.400 వందలు చెల్లిస్తు న్నాం. ఎకరాకు పెట్టుబడి రూ. లక్ష వరకు పెట్టాం. ధర లేకపోవడం.. కూలీ పెరగడంతో మిరప కోతకోయకుండా చెట్లపైనే వదిలేశా. ప్రభుత్వ పరంగా ఆదుకుంటే తప్పా రైతులు ఈ కష్టం నుంచి బయట పడే అవకాశం లేదు.
– రవి, రైతు, మిడిదొడ్డి
మిర్చి పంటకు కొమ్మకుళ్లు, ఆకుముడత జెమిని వైరస్ ఆ శించడంతో ఎకరాకూ 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రా వడం లేదు. గతేడాదితో పో ల్చితే సాగు పెరిగినప్పటికీ దిగుబడి లేదు. ధరలు తగ్గాయి. దీంతో పెట్టుబడి వస్తుందో..? లేదో? అని ఆందోళనలో ఉ న్నాం. ఎకరాకు రూ. 20 వేలు కౌలుకు తీసుకొని నాలుగు ఎకరా లు మిరప సాగు చేశాను. ప్రస్తుతం కౌలు పోయి పెట్టుబడి వస్తే చాలు అనుకుంటు న్నా. ధర లేనందుకు పొలంలోనే పంటను ఆరబెట్టా. ధర పెరుగుతుందని చాలా మంది రైతులు పొలాల వద్దనే ఆర బె ట్టారు. ధర పెరిగితే లాభాలు.. లేదంటే నష్టాలే..
– ఈరన్న, రైతు, బింగిదొడ్డి
మిర్చికి ధర బాగుందని ఆశతో వానకాలంలో నాలుగు ఎకరాలోల మిరపసాగు చేశాను. ఎకరకూ కౌలు కలుపుకొని సు మారు రూ.1.50 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. గతేడాది గుంటూరు రకానికి రూ.20 వేల పైన ధర ఉండేది. ప్రస్తుతం రూ.15 వేలు దాటడం లేదు. ఎకరాకు 20 క్వింటాళ్లపైనే దిగుబడి వస్తుండేది.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కేవలం 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది. గతంలో క్వింటాకు రూ.35 వేల ధర రాగా.. ఏసారి రూ.18 వేలు దాటడం లేదు. గతంలో ఉన్న ధరలను పోల్చుకొని సాగు పెంచితే ధరల్లేవు.. అనుకున్న స్థాయిలో దిగుబడి లేదు. దీంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– పరశురాం, రైతు, ఉప్పల
జోగుళాంబ గద్వాల జిల్లాలోని భూములు మిర్చి సాగుకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ పం టకు ఆసక్తి చూపుతారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని మల్దకల్ ప్రాంతంలో ఎక్కువగా పంట సాగు చేస్తారు. ఏడాదికి ఏడాది సాగు జిల్లాలో పెరుగుతున్నా రైతులకు మాత్రం అనుకున్న స్థాయిలో లా భాలు రావడం లేదు. 2020లో 24,388, 2021 లో 35,085, 2022లో 36,757 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా.. మంచి లాభాలు వచ్చాయి. దీంతో 2023లో 65,115, 2024లో 75,842 ఎకరాల్లో పంట సాగైంది. అయితే రైతులు ఎక్కువగా సాగు చేయడంతో తెగులు సోకడం, అనుకున్న స్థాయిలో ధరలు లేకపోవడం, దిగుబడి తగ్గడం తో పెట్టుబడి వస్తే చాలు అ నే ఆలోచనలో రైతులు ఉన్నారు. ప్రభుత్వపరంగా చే యూతనిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.