CMRF | మరికల్, జూన్ 13: ముఖ్యమంత్రి సహాయని నిధి చెక్కును శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుమతితో ఆయన తమ్ముడు బాధితుడి కుటుంబానికి అందజేశారు. మరికల్ మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పాలెం రంగప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందిన తర్వాత నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్సార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా అట్టి చెక్కును బాధితుడు రంగప్పకు ఎమ్మెల్సీ తమ్ముడు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూసలపాడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు విష్ణు కాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.