పాలమూరు జిల్లాలో గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో గురువారం సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అభివృద్ధి ప్రదాతకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అచ్చంపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జనసమీకరణ చేసేందుకు కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సభకు లక్ష మంది వరకు తరలించాలని సూచనలిచ్చారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన చేపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. బీ ఫారం అందుకున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ‘కారు’ జోరుకు తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగలు తగులుతుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాగా, అభ్యర్థులెవరో తెలియక కమలం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఎవరికి వారు తాము పోటీలో ఉంటామని ప్రకటించుకుంటుండడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరికి మద్దతివ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభి వృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం నాగర్‌కర్నూ ల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి న భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్.. ఈ సారి నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనుండడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నా యి. అనివార్య కారణాలవల్ల నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభ వాయిదా పడింది. ఆ వెంటనే వనపర్తి నియోజకవర్గంలో సభకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సభకోసం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏర్పాట్లను చేపడుతున్నారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పా టు చేసి సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంతో గులాబీ దళం వ్యూహాత్మకంగా ప్రచారంలో దూసుకుపోతున్నది. సాక్షాత్తు సీఎం కేసీఆరే మూడు నియోజకవర్గాల్లో పర్యటించడం.. మిగతా చోట్ల కూడా ఎన్నికల ప్రచారాలకు ముహూర్తం ఖరారు చేస్తుండడంతో విపక్షాల్లో దడ మొదలైంది. అసలు తమకు ప్రచారానికి అయినా సమయం ఉంటుందా అని విపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా 35 రోజుల సమయం మాత్రమే ఉండడంతో కారు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నది. బీఫారం అందుకున్న అభ్యర్థులు ప్రచారం చేపడుతున్నారు.
గులాబీ బాస్ కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. జడ్చర్లలో ఎన్నికల శంఖారావం పూరించిన ఎనిమి ది రోజుల తర్వాత అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాలోల ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా.. మళ్లీ మూడు రోజుల తర్వాత వరుసగా మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు సగం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన తరువాత మిగతా నియోజకవర్గాలనూ చుట్టి రానున్నారు. ఎన్నికల ప్రచారం చివరి దశలో మరో విడుత ప్రచారానికి శ్రీకారం చు ట్టబోతున్నారు. మూడు విడుతల్లో అన్ని నియోజకవర్గాలను కవర్ చేయడంతోపాటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి ప్రచారం చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ లోపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు కూడా అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో రోడ్‌షోలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తుండడంతో భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ మేరకు వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి స్వయంగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేపట్టాలని, ఇందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. మండల కేంద్రాల నుంచి ర్యాలీలతో వచ్చేలా ప్లాన్ చేయాలని వివరించారు. సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణు లు సిద్ధం కావాలన్నారు. వనపర్తి ఎన్నికల ప్రచా ర సభ విజయవంతం చేసి విపక్షాలకు కండ్ల ముందే ఓటమి భయం చూపిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ చెబుతున్నారు. అచ్చంపేటలో కూడా జన సమీకరణ చేసేందుకు విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గ, మండల నేతలతో సమావేశమయ్యారు. అన్ని గ్రామాలు, మండలకేంద్రాల నుంచి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలను తరలించాలని కోరారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సభలతో గులాబీ విజయం ఖాయంగా కనిపించాలని సూచించారు. సుమారు 80 వేల నుంచి లక్ష మందిని తరలించేందుకు టార్గెట్ పెట్టుకున్నారు.