కల్వకుర్తి, జూలై 4 : సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కాంస్ పార్టీలో గందరగోళం నింపింది. జెడ్పీటీసీగా 2006 లో రాజకీయ జీవితాన్ని మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభి ంచిన సీఎం రేవంత్‌రెడ్డి 20 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఊర్కొండ పేట అభయాంజనేయుడి సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నారు. తన రాజకీయ భవిష్య త్‌కు సహకరించిన ఆనాటి మిత్రులు, ఆత్మీయులతో కలిసి ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనంలో అసలైన మిత్రు లు, ఆత్మీయులను పక్కన బెట్టారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచిన రేవంత్‌రెడ్డి గెలుపునకు పార్టీలకు అతీతంగా సహకరించిన వారు చాలా మంది ఉన్నారు.
వారందరికీ సీఎం అత్మీయ సమ్మేళనంలో అహ్వానం ఉన్న ప్పటికీ ఆఖరి క్షణంలో చాలామంది పేర్లు గల్లంతయ్యాయి. ఊర్కొండ, మిడ్జిల్ మండలానికి చెందిన ఒకరిద్దరు నేతలు తమకు అనుకూలంగా వారి పేర్లు తయారు చేసి ఎమ్మెల్యే చేత పాస్‌లు ఇప్పించారని పాస్‌లు రాని కాంగ్రెస్ నేతలు బ హిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాన ఎజెండా ఏమిటంటే.. అనాడు రేవంత్‌రెడ్డి గెలుపుకోసం పనిచేసిన వారిని పార్టీలకు అతీతంగా పిలిచి వారిని గౌరవించుకోవడం. కాకపోతే ఎజెండా మరో వి ధంగా మారిపోయింది.
ఊర్కొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు, మిడ్జిల్ మండలానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు తమ అనుచరగణానికి పెద్దసంఖ్యలో పాస్ లు ఇప్పించడంతో ఆత్మీయ సమ్మేళనం అర్థమే మారిపో యిందని పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడు తు న్నారు. ఆత్మీయ సమ్మేళనంలో మిడ్జిల్, ఊర్కొండ మం డలాలకు చెందిన వారు ఉండాల్సి ఉండగా.. కల్వకుర్తి, నాగ ర్‌కర్నూల్, జడ్చర్ల.. ఇలా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా పాల్గొనడం గమనార్హం. 2006లో రేవంత్‌రెడ్డి వెంట వెన్నంటి ఉన్న తమకు దూరం పెట్టారని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాకు అనుమతి లేదని డీపీఆర్వో ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సీఎంవో ఆదేశాలను అనుసరించి మీడియాకు పాస్ లు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. కాకపోతే.. ఎమ్మె ల్యేకు అనుకూలంగా ఊర్కొండ, మిడ్జిల్ మండలాలకు చెందిన విలేకరులకు వీఐపీల పేరిట పాస్‌లు పంపిణీ చేయ డంపై జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తు న్నారు. ఇదేమి కొత్త పద్ధతి అంటూ మండిపడుతున్నారు.
ఊర్కొండ గేట్ నుంచి ఊర్కొండపేట వరకు నాలుగు కిలో మీటర్ల వరకు పోలీస్ వలయంలో ఉండిపోయింది. శనివా రం ఉదయం నుంచి ఊర్కొండ గేట్ నుంచి ఊర్కొండ పేట వరకు గల ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. ఊర్కొండ గేట్ వద్ద ఉన్నత పాఠశాలకు సెలవు ప్రకటించారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేవలం పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అను మతించారు. సాయంత్రం 4:30 గంటల వరకు నిర్భందం కొనసాగింది.
వాతావరణం సహకరించకపోవడంతో సీఎం పర్యటన మూ డు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రోడ్డు మార్గాన సీఎం వచ్చారు. పర్యటన ఆలస్యం కావడంతో చుట్టు పక్కల గ్రామాల వారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇ బ్బంది పడ్డారు. సీఎం రోడ్డు మార్గాన రావడంతో పోలీ సులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. కల్వకుర్తి-జడ్చర్ల రహ దారిలో వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయానికి వస్తే సీఎం రేవంత్‌రెడ్డి అభయాంజనేయునికి ప్రత్యేక పూజ లు చేశారు. రూ.10కోట్లతో దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.