మంత్రి నిరంజన్‌రెడ్డికి ప్రశంసలు
సా మాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయం గా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కేం ద్రం ప్రశంసించింది
- క్షయ వ్యాధిగ్రస్తులకు సొంత డబ్బుతో బలవర్ధకాహారం పంపిణీ చేయడంతో కేంద్రం కితాబు
- అమాత్యను అభినందిస్తూ ట్వీట్ చేసిన సెంట్రల్ ఆరోగ్య శాఖ
వనపర్తి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సా మాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయం గా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కేం ద్రం ప్రశంసించింది. గురువారం కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ట్వీట్ చేసింది. ‘లీడర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్’ అంటూ కొనియాడింది. టీబీ రోగులకు సహకారం అం దించేందుకు నిక్షయమిత్ర పేరిట కేంద్రం ఓ కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగా దాతల నుంచి సహకారం కోరింది.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మంత్రి నిరంజన్‌రెడ్డి సొంతంగా బియ్యం, నూనె, ప ప్పు, పండ్లు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు ఉన్న బలవర్థకమైన ఆహారాన్ని ప్రతినెలా అందించేందుకు ముందుకొచ్చి ఈ నెల 94 మందికి మంత్రి పంపిణీ చేశారు. నిరంజన్‌రెడ్డి స్ఫూర్తిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు టీబీ రోగులకు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం గు ర్తించి ట్వీట్లో మంత్రి సేవలను కొనియాడింది.
అన్ని వసతులతో నిత్యాన్నదాన సత్రం
కోనేర్ కోనప్ప నిత్యాన్నదానం మాదిరిగా ఏర్పాటు చేస్తాం : మంత్రి
వనపర్తి, డిసెంబర్ 29 : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కోనేర్ కోనప్ప నిత్యాన్నదాన సత్రం మాదిరిగా వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల కోసం ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
గురువారం బీఆర్ఎస్ జిల్లా శిక్షణా తరగతుల కమిటీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డితో కలిసి మంత్రి నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలించారు. నిరంతరం వండుతున్న భోజన ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు సురేందర్ ఉన్నారు.

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

