వెల్దండ. డిసెంబర్ 9 : మండలకేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆ విర్భావ వేడుకలను ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద జాతీ య రహదారిపై పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబురాలు జరుపుకొన్నారు. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మా ట్లాడుతూ బీఆర్ఎస్ కోసం దేశ ప్రజలు ఎ దురుచూస్తున్నారన్నారు. అదే విధంగా హైదరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో జెడ్పీచైర్మన్ బాలాజీసింగ్‌తో కలిసి కొట్ర గ్రామానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రవీందర్రావు, అజిలాపూర్ నా యకులు కాలె వెంకటేశ్, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు. ఎంపీ సంతోష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ జయప్రకాశ్, జియాగూడ అధ్యక్షుడు జంగయ్యయాదవ్, యూత్ అధ్యక్షుడు యాదగిరి, సర్పంచులు అంజయ్య, పత్యా, కుమార్, భీమయ్య, ఎంపీటీసీలు గుత్తివెంకటయ్య, రాములు, నాయకులు గోపాల్‌నాయక్, ఈశ్వరయ్య, బాలు, ఆలీ, తిర్మల్‌రావు, వైఎస్‌రెడ్డి, పర్వతాలు, హరికిషన్, గు త్తిబాలు, ఆనంద్, శేఖర్, దేవేందర్, జహంగీర్ టాక్యా, రాము ఉన్నారు.
కల్వకుర్తి, డిసెంబర్ 9 : టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడాన్ని స్వాగతిస్తూ మండలంలోని ఎల్లికల్ గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తిరుపతి, కృష్ణయాదవ్, మొగులాల్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీను, లోకేశ్, శ్రీకాంత్ గౌడ్, బాలయ్య, బాలీశ్వర్, రాము లు తదితరులు పాల్గొన్నారు.
ఊర్కొండ, డిసెంబర్ 9: బీఆర్ఎస్కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జెండాను ఆవిష్కరించడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధాజంగయ్య, జెడ్పీటీసీ శాంతకుమారి రవీందర్, వైస్ ఎంపీపీ అరుణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకలు, తదితరులు ఉన్నారు.
చారకొండ, డిసెంబర్ 9 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ గుండె నిర్మలావిజేందర్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ జెల్ల గురువయ్యగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో శుక్రవారం మండలంలో సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వంగూరు, డిసెంబర్ 9 : బీఆర్ఎస్తో సీఎం కేసీఆర్ దేశంలో చరిత్ర సృష్టించడం ఖాయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ భీమమ్మాలాలూయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు హమీద్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందన్నారు. బీజేపీని ఎదుర్కోవటంతో దేశంలో కాంగ్రెస్ విఫలమైందని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, పెద్ద ఎత్తున ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టడంతో రైతులతోపాటు అన్ని వర్గాలు సంతోషంగా ఉ న్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ప్రజలందరికీ అందించేందు కు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పా టు చేశారన్నారు. బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభు త్వం ఏర్పాటు చేయడం ఖాయమని వారన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కేవలం బీఆర్ఎస్కే సాధ్యమన్నారు.