మరికల్ : మండలంలోని పూసలపాడు గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు గ్రామాల్లో సిసి రోడ్లు మొరుగుకోవాలని నిర్మాణానికి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కృషి చేస్తుందని అన్నారు. పసుపుల కేజీబీవీ పాఠశాలకు తాగునిందించేందుకు మిషన్ భగీరథ పైప్ లైన్ ను ఆరు లక్షల 50 వేలు రూపాయలతో చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెలగొంది వీరన్న, నారాయణపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నాగరాజు, హరీష్ కుమార్, జంగిడి రవి, రామకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, రవి గౌడ్, రాజు, లింగం గౌడ్, సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిత, మిషన్ భగీరథ ఏఈ యమునా సాగర్, తదితరులు పాల్గొన్నారు.