హైదరాబాద్ : దైవదర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు వారి కుటుంబాన్ని కబళించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో తల్లి, కొడుకు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్ రెడ్డి, నందిని దంపతులు దైవ దర్శనం కోసం కారులో యాదగిరిగుట్టకు బయలుదేరారు.
అడ్డాకులలో ఆగిఉన్న లారీని ఢీ కొట్టడంతో ప్రకాశ్ రెడ్డి భార్య నందిని, వారి నాలుగేళ్ల కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ రెడ్డిని వనపర్తిలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.