దేవరకద్ర, నవంబర్ 5 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్ర చారం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో ఎంపీపీ రమాదేవి, మం డలాధ్యక్షుడు జేట్టి నర్సింహారెడ్డి పట్టణంలో ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరంగా ని ర్వహిస్తున్నారు. తెలంగాణలో అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతిగడపకు వివరించారు. ఈసారి అత్యధిక మెజార్టీతో బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, పట్టణాధ్యక్షుడు బాలరాజు, మాజీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, సత్యంసాగర్, శి వనంద్, కుర్వరాము, రాధాకృష్ణ, యుగేందర్‌రెడ్డి, చాల్మారెడ్డి, సయ్యద్ జక్కి, బైండ్ల రా ములు,బాలరాజు, ఆంజనేయులు ఉన్నారు.
దేవరకద్రరూరల్(చిన్నచింతకుంట), నవంబర్ 5 : చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భం గా సీఎం కేసీఆర్ రూపొందించిన అసెంబ్లీ ఎ న్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 5 : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని సర్పంచ్ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని గోవిందహళ్లిలో స్థానిక నా యకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలతోపాటు ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పి న పథకాలు రాష్ట్రంలో మళ్లి అమలు కావాలంటే కారుగుర్తుకే ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సోమవారం దేవరకద్ర మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిరావాలని ప్రజల కు విజ్ఞప్తి చేశారు. ద్వారకానగరంలో బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, ఎంపీపీ పద్మావతి, మహిళా మండలాధ్యక్షురాలు అనురాధ, మ హిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు అర్చన, సర్పంచులు శ్రావణి, శారధ, విష్ణు, రమేశ్, కృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు.
భూత్పూర్, నవంబర్ 5 : బీఆర్ఎస్ నా యకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించా రు. ఆదివారం మండలంలోని అన్ని గ్రామా ల్లో నాయకులు ముమ్మరంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి మండలంలోని వెల్కిచర్లలో ప్రచారం చేస్తూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలకు మహర్దశ వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షే మ పథకాలను అమలుచేస్తున్నారని, ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనులను చేస్తున్నట్లు ఆ యన తెలిపారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మండలంలోని కరివెనకు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషి ఎంతో ఉందని ఆయన పే ర్కొన్నారు. మున్సిపాలిటీలోని వార్డుల్లో, మండలంలోని గ్రామాల్లో నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటీ, రా మకృష్ణ, మూడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, బాలస్వామి, అజీజ్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.