నాగర్‌కర్నూల్/ బల్మూరు, మార్చి10 : ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్‌తో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే పంజాబ్ రాష్ర్టానికి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని ప్రమాద స్థలం నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ జిల్లా ద వాఖానకు తరలించారు. ఈ నేపథ్యంలో సో మవారం టన్నెల్లో మరో 7మందికి కోసం అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి సహాయక చర్యలు ముమ్మ రం చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకన్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు మట్టి దిమ్మెలు కూలితే వాటికి సపోర్టుగా కట్టెలు ట్రైన్లో తీసుకెళ్లారు. సహాయక చర్యలో భాగంగా సా ంకేతిక నిపుణులు, రేస్క్యూ ఆపరేషన్, రక్ష ణ, సహాయక , గాలింపు చర్యలో పురోగతి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రోబోలతో చిక్కున్న కార్మికులను బయటకు తీసుకవచ్చేందుకు కృషి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదస్థంలో నీళ్లు రావడంతో వాటిని పైప్‌లైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. అయితే గురుప్రీత్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంతాపం ప్రకటించారు. అదేవిధంగా మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. టన్నెల్ వద్ద సహాయక సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యా లు కల్పించినట్లు తెలిపారు. అయితే 12 రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్లి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. మరో మూడు మృతదేహలు ఉన్నట్లు సింగరేణి జీఎం, సి బ్బంది డాగ్స్ సహాయంతో గుర్తించినట్లు స మాచారం. జీఎం బైద్య నేతృత్యంలో సహయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.