నారాయణపేట, జూలై 7 : రోడ్డు లేని గ్రామాలకు బస్సు నడపలేమని చెబుతూ ఆయా గ్రామాలవైపు క న్నెత్తి చూడని ఆర్టీసీ బస్సులు.. రోడ్డు సౌకర్యం మంచిగా ఉన్న గ్రామాలకు కూడా బస్సులను నడిపించడం లేదు.. ఒక వేళ కొన్ని గ్రామాలకు బస్సులను నడిపిస్తు న్నా అవి సరైన వేళకు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న పరిస్థితి నారాయణపేట జిల్లాలో నెలకొంది. నిరుపేద విద్యార్థులు తప్పని పరిస్థితిలో కాలిబాటన వెళ్లి సర్కారు బడుల్లో విద్యను అభ్యసిస్తుండగా, కొంత ఆర్థికస్థోమత కలిగిన విద్యార్థులు మాత్రం తమ గ్రామాలకు వచ్చే ప్రైవేట్ బస్సులను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు పొంది విద్యను అభ్యసిస్తున్నారు. బస్సుల రాకపోకలకు వేళపాళా లేకపోవడంతో రోడ్లపై వెళ్లే వా హనదారులను లిఫ్ట్ అడుగుతున్న పరిస్థితు లు నిత్యం కనిపిస్తున్నాయి. బస్సులను స మయానికి నడపాలని పలు విద్యార్థి సం ఘాల నాయకులు అధికారులకు విన్నవించినా అవి ఒకటి రెండు రోజులకే పరిమితమవుతున్నాయి. నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల, కొత్తపల్లి, కొల్లూరు, సమస్తపూర్, వల్లంపల్లి గ్రా మాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో కా లినడకన పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. మాగనూర్ మండలంలోని కొత్తప ల్లి, తాలంకేరి గురురావు లింగంపల్లి, వ ర్కూర్ గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు కాలినడకన మాగనూర్కు వ స్తుంటారు.
తాలంకేరి గురురావు లింగంపల్లి, వర్కూర్ గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు నడుస్తున్నా సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొన్ని గ్రామాల్లో అయితే తమ పిల్లలను కాలిబాటన నడిపించలేక ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యంతో మాట్లాడి తమ గ్రామాలకు ప్రైవేట్ బస్సులు వచ్చే విధంగా చూసుకొని, తమ పిల్లలను సర్కారు బడి మాన్పించి ప్రైవేట్ బడుల్లో చదివిస్తున్నారు. ఇక సాయంత్రం సమయంలో అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి మించి రెండు, మూడింతలు ఎక్కుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే బస్సు డోర్ల వద్ద వేళాడుతూ వెళ్తు న్న పరిస్థితులు ఉన్నాయి. పాఠశాలల పునః ప్రారంభోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల స్థా నిక ఆర్టీవో ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించడం మంచిగా ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో వేలాడుతూ విద్యార్థులు ప్రయాణిస్తున్నా మాత్రం చర్యలు తీ సుకోవడంలో మిన్నకుండా ఉండడం చూ స్తుంటే ప్రైవేట్ రంగంపై ఒక విధంగా ప్రభు త్వ రంగంపై మరో విధంగా ఆర్టీవో తీరు ఉం దని విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ప్రమా దం జరిగితే నష్టం ఎవరికనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్ సమయంలో విద్యార్థులకు సరిపడా బస్సులను నడపాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉన్నది. అదే సమయంలో బస్సుల్లో మోతాదుకు మించి ప్రయాణాలు చేస్తుంటే చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టీవో సైతం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.