మక్తల్, మే 2 : లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకా రం.. మక్తల్ నల్లజానమ్మ ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై లారీని నిలిపి ఉంచారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు నిలిపి ఉన్న లారీని శుక్రవారం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినగా, తృటిలో 35 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బస్సుడ్రైవర్తోపాటు సహాయకుడికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని స్థానికులు రాయిచూర్లోని దవాఖానకు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.