సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత
సీఎం ఇలాకా.. నారాయణపేట జిల్లా కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దుశ్శాసన పర్వం కొనసాగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఇండ్లపైకి బుల్డోజర్లను పంపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాదాపు ఆరేడు ఇండ్లు, దుకాణాలను కూల గొట్టారు. ఉదయం నిద్రలేవకన్న ముందే బయట కూల్చివేతలు ప్రారంభించారు..
- కోస్గిలో కొనసాగిన కూల్చివేతలు
- సమాచారం లేకుండా చర్యలు
- రోడ్డు విస్తరణ పనుల్లో జనం నిలదీతలు
- బాత్రూంలో ఉండగానే భవనాన్ని కూల్చారంటూ మహిళ తీవ్ర ఆగ్రహం
- కార్యాలయానికే అధికారులు పరిమితం
- అధికార పార్టీ నేతల దుశ్శాసన పర్వం
మహబూబ్నగర్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం ఇలాకా.. నారాయణపేట జిల్లా కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దుశ్శాసన పర్వం కొనసాగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఇండ్లపైకి బుల్డోజర్లను పంపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాదాపు ఆరేడు ఇండ్లు, దుకాణాలను కూల గొట్టారు. ఉదయం నిద్రలేవకన్న ముందే బయట కూల్చివేతలు ప్రారంభించారు.. అక్కడికి వెళ్లి పలువురు మా వద్ద కోర్టు స్టే కాపీ ఉందని, కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. అయితే సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళ బాతురూంలో ఉండగానే గోడను కూల్చగా.. సిగ్గు పడని నేతలు సమర్థించుకోవడం గమనార్హం.

ప్రజా ప్రతినిధులుగా ఉండి.. రౌడీల్లాగా ప్రవర్తిస్తూ.. విచక్షణ కోల్పోయి మాట్లాడారు. అయితే తాము రోడ్డు విస్తరణ పనులకు, అభివృద్ధికి అడ్డుకామని, కాస్తా సమయం ఇవ్వమని అడిగినా కనికరం లేకుండా.. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తమపై బెదిరింపులకు దిగారంటూ పలువురు ఆవేదన చెందారు. అనంతరం అక్కడే ఉన్న చిరు వ్యాపారుల నిర్మాణాలను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. కాగా సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ మా భవనం కూల్చొద్దని ఎంత వేడుకన్నా నాయకులు, కౌన్సిలర్లు వినలేదని చెప్పింది. మీరు ఇంట్లో ఉన్నా కూల్చేస్తామంటూ హెచ్చరించారని వాపోయింది. తాను బాత్రూంలో ఉండగానే గోడ కూల్చివేశారని కన్నీటి పర్యంతమైంది. పోలీసులకు, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా వారు అక్కడకు రాలేదన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారమే హద్దుగా రెచ్చిపోయి.. కనీసం ప్రజాప్రతినిధులమన్న సోయి లేకుండా వ్యవహరించారని విపక్షాలు ఆరోపించాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

