పట్నం అరెస్టుపై ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం వాకింగ్కు వెళ్లిన పట్నంను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు.
- ఉమ్మడి జిల్లాలో భగ్గుమన్న బీఆర్ఎస్
- మిన్నంటిన నిరసనలు
- కోస్గిలో పార్టీ నేతల అరెస్టు
- రైతుల పక్షాన పోరాడితే అక్రమ కేసులా..? అంటూ ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం వాకింగ్కు వెళ్లిన పట్నంను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. బాధ్యతాయుతమైన నేతను అక్రమంగా కేసులో ఇరికించారని కన్నెర్ర చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటూ కొడంగల్ నియోజకవర్గంలో దమనకాండ జరుగుతుందన్నారు.

ఇక్కడి రైతులకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపించడం ఏమిటని, ఇదెక్కడి న్యాయమన్నారు. పట్నంపై పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్నం అరెస్టును ఖండించారు. ప్రజాస్వామ్య హితంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని ఆరోపించారు.
– మహబూబ్నగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

