V Srinivas Goud | మహబూబ్ నగర్ అర్బన్, మార్చి 16 : ఇవాళ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు, అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శ్రీనివాస్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మయూరి పార్క్ వద్ద గౌడ సంఘం నాయకులు, బైపాస్ చౌరస్తాలో ఎదిర నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేశారు. అంతకు ముందు అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్‌ను భుజాన ఎత్తుకొని కేరింతలు కొడుతూ.. న్యూ టౌన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు సంబరాలు చేసుకుంటూ చేరుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని… కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్ట పెంచేలా ప్రతీ ఒక్కరు పని చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామన్నారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు,పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మాజీ కౌన్సిలర్లు, మహబూబ్ నగర్, హన్వాడ మండలాల మాజీ జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపిటిసిలు సర్పంచులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు