నేడు ఓట్ల లెక్కింపు
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్ శనివారం ప్రకటనలో తెలిపారు. గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 77.13 శాతం ఓట్లు పోలయ్యాయి.
- బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న పార్టీ శ్రేణులు
మక్తల్, డిసెంబర్ 2: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్ శనివారం ప్రకటనలో తెలిపారు. గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 77.13 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈవీఎం లను నారాయణపేట జిల్లా కేంద్రంలోని దత్తసాయి కళాశాలలో పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,42,254 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,19,403 మంది, స్త్రీలు 1,22,849 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఇండియన్ ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థులతో పాటు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ని యోజకవర్గంలోని ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, అమరచింత, ఆత్మ కూర్, మరికల్, మదనాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన 284 పోలింగ్ కేం ద్రాల్లో గురువారం జ రిగిన పోలింగ్‌లో మొ త్తం 1,86,860 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయం
అధికార బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆపార్టీ నా య కులు అంటున్నారు. పార్టీ బీఫారం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విస్తృతంగా పర్యటించి సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను చూసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో చిట్టెంకు మద్దతుగా సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొనగా , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మక్తల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రజాఆశీర్వాద సభ, రోడ్‌షోకు ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించింది. దీంతో చిట్టెం హ్యట్రిక్ విజయం సాధిస్తారని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

