ఖిల్లాఘణపురం, డిసెంబర్ 27 : రైతుబంధు, రైతుబీమాతోపాటు ఇక్కడి పథకాలన్నీ దేశవ్యాప్తం చేసి.. దేశం పురోభివృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రోడ్డుమీదితండా, వెంకటాంపల్లి, దొంతికుంట తండా, సోలీపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, గట్టుకాడిపల్లిలో కామన్హాల్, కుంటమందరి తండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్, సోలీపూర్‌లో గ్రామ పంచాయతీ హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సల్కలాపూర్లో బస్టాండ్, పర్వతాపూర్‌లో కామన్హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నదని, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు భరోసా కల్పిస్తున్నాయన్నారు.
‘జై జవాన్-జై కిసాన్’ అ న్నది నినాదానికే పరిమితైందని, ఆచరణకు మా త్రం నోచుకోవడం లేదన్నారు. దేశ రైతన్నలకు బీ ఆర్ఎస్ అండగా నిలబడుతుందన్నారు. బీఆర్ఎ స్ ఆవిర్భావంతో బీజేపీకి వణుకు పుడుతుందన్నా రు. రాష్ట్రంలో మిగిలిన రైతులకు త్వరలోనే రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. కేంద్ర ప్రభు త్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. తెలంగాణ ప్రగతిని అడ్డుకోలేదన్నారు. తెలంగాణలో పల్లెపల్లెనా ప్రగతి జాడలు కనిపిస్తున్నాయన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని చె ప్పారు. అన్నం పెట్టే అన్నదాతకు ఎన్నాళ్లీ అవస్థలని.., దేశంలో కేసీఆర్ పాలనతోనే రైతన్నలు సంతోషంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, సింగిల్‌విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రావు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, వైస్ చైర్మన్ బాలీశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు శ్యాంసుందర్‌రెడ్డి, సత్యం, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలి..
ప్రభుత్వం కల్పిస్తు న్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బా గా చదివి ఉన్నత స్థా నాలను అధిరోహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మండల కేం ద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవ సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను తిలకించి విజేతలకు బహుమతు లు ప్రదానం చేశా రు. ఈ సందర్భం గా మాట్లాడుతూ పురుషులతో స మానంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంతో నేటి సమాజంలో అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం పెరిగిందన్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన ఊరికి పేరు తీసుకురావాలని సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చదువుకునేందుకు వచ్చే విద్యార్థినులకు సైకిళ్లను అందిస్తానని చెప్పారు.
పత్తి పంటను పరిశీలించిన మంత్రి..
మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ శివారు లో సాగు చేసిన పత్తి పంటలను మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచిందన్నా రు. పత్తి రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. మన పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఇలాంటి సంక్షేమాన్ని అ మలు చేయాలని మిగతా రాష్ర్టాల్లోని ప్రజలు అ క్కడి సీఎంలను వేడుకుంటున్నారని తెలిపారు. సీ ఎం కేసీఆర్ చొరవతో నేడు సాగునీరు పుష్కలం గా పారుతున్నదని చెప్పారు. కర్షకులు సంతోషం గా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు.